తెలంగాణ

బాలికపై అత్యాచారం కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, మే 7: ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలోని పల్లంగూడ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిపిన ఐదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశామని బెల్లంపల్లి డిఎస్‌పి రమణారెడ్డి తెలిపారు. ఇదే కేసులో పంచాయితీ నిర్వహించిన 20 మందిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. శనివారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పల్లంగూడ గ్రామానికి చెందిన బాలికను చిర్రకుంట మహేందర్ (20), అనే అటో డ్రైవర్ ఆటో జనవరి నెల 2015లో పాఠశాలకు తీసుకువెళ్తూ స్నేహం చేశాడు. ఇదే తరుణంలో ఆమెను మచ్చిక చేసుకుని, ఆపై లొంగదీసుకుని శారీరక సంబంధం కొనసాగించాడు. ఈ విషయం అతని స్నేహితులైన అట్కాపురం విజయ్ కుమార్, రాళ్ళపల్లి సంతోష్, నేతుల ప్రశాంత్‌లకు తెలిసి వారు కూడా సదరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిర్రకుంట మహేందర్ తండ్రి అయిన చిర్రకుంట లక్ష్మయ్య కూడా గుట్టుచప్పడు కాకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలానికి బాలిక శారీరక వచ్చిన మార్పులు గమనించిన ఆమె తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిన అసలు విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 2న తమకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను ఆశ్రయించగా 20 మంది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి 2 లక్షల 50 వేల రూపాయలు నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా తీర్పు నిచ్చారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులపై నిర్భయ కేసుతో పాటు లైంగిక వేధింపుల చట్టం కేసు నమోదు చేశామని, పంచాయతీ నిర్వహించిన 20మందిలో 16 మంది పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సదయ్య,. దేవాపూర్ ఎస్‌ఐ స్వామి, మందమర్రి ఎస్‌ఐ సతీష్ పాల్గొన్నారు.