S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/09/2016 - 06:51

సంగారెడ్డి, మే 8: భూమితల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే భూమిపుత్రుల కష్టార్జితం మార్వాడీ బీరువాల్లో మూగగా రోదిస్తోంది. ఒకరూ ఇద్దరు కాదు.. మొత్తం గ్రామమే తాకట్టులో తల్లడిల్లుతోంది. ఆపదనుంచి ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సర్కారు బీమా వారిలో ధీమాను పెంచకపోగా, మరింత కుంగిపోయేలా చేస్తోంది. శ్రమించి పండించిన పంటతో కొన్న బంగారం విడిపించుకోలేక మార్వాడీలకే వదిలేస్తున్న దారుణ దయనీయమిది.

05/09/2016 - 06:50

హైదరాబాద్, మే 8: మంచినీటి అవసరాల కోసం నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కర్నాటక నీటిపారుదలమంత్రి ఎంబి పాటిల్‌ను కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్రమైన మంచినీటి సమస్య ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లివ్వాలని కోరారు. గతంలో సైతం హరీశ్‌రావు ఈ అంశాన్ని కర్నాటక ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.

05/09/2016 - 06:49

హైదరాబాద్, మే 8: చాలా రోజుల తరువాత సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ యాత్రకు బయలు దేరుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై ఆయా సిఎంలతో ప్రధాని స్వయంగా చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సిఎంలతో చర్చించిన తరువాత మూడవ రాష్ట్రంగా తెలంగాణ కరవు పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిఎం కెసిఆర్‌ను ఢిల్లీ రావాలని ఆహ్వానించారు.

05/08/2016 - 20:05

సికింద్రాబాద్: నగరంలోని కార్ఖానా ప్రాంతంలో ఓ బస్‌స్టాప్‌వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

05/08/2016 - 20:04

హైదరాబాద్:తెలంగాణలో కరవు పరిస్థితులపై అన్ని శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రులతో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశానికి కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిస్థితులు, కేంద్రంనుంచి కోరవలసిన సహాయం తదితర అంశాలపై కూలంకుషంగా చర్చ జరిగింది.

05/08/2016 - 05:50

కరీంనగర్/ఆదిలాబాద్/మెదక్/నిజామాబాద్, మే 7: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కరీంనగర్‌లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదులుగాలులతో వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంబాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు లోతట్టు కాలనీలు జలమయం కాగా, కాలనీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

05/08/2016 - 05:48

హైదరాబాద్, మే 7: తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణపై హైకోర్టు శనివారం రాష్ట్రప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. నక్కా గోవింద్‌రెడ్డి మరో 23 మంది ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

05/08/2016 - 05:47

హైదరాబాద్, మే 7: ప్రముఖ రచయిత, కవి బోయ జంగయ్య(74) శనివారం రాత్రి కన్నుమూశారు. ప్రఖ్యాత నవలా రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన జంగయ్య రెండు మాసాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ఆయన రచనలు చేసినప్పటికీ, కథలు, నవలా రచయితగానే ఆయన ఎక్కువగా కీర్తి గడించారు. దళిత వాదాన్ని, మానవతా వాదాన్ని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేస్తూ రచనలు చేసిన వారిలో జంగయ్య అగ్రగణ్యులు.

05/08/2016 - 05:35

హైదరాబాద్, మే 7: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాస్తున్న వారిలో కొంత మంది అనుమానితులను నిర్వాహకులు గుర్తించారు. అయితే పరీక్ష రాస్తున్న అనుమానితుల లక్ష్యం ఏమిటో, ఎందుకు రాస్తున్నారో, వారేం చేయబోతున్నారో తాము పోలీసులకు సమాచారం ఇచ్చి వివరాలు సేకరిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు చెప్పారు.

05/08/2016 - 05:33

హైదరాబాద్, మే 7: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘చలో కర్నాటక’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆర్‌డిఎస్ వివాదం పరిష్కారం, జూరాలకు 3 టిఎంసిల నీటి విడుదల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 10న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ కానున్నారు. అంతకు ముందు రోజు (9న) కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆర్‌డిఎస్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

Pages