S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/09/2016 - 12:40

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థి దేవీరెడ్డి కారు ప్రమాదంలో మరణించడానికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సోమవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టు ఆదేశిస్తే గనుక నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలిస్తారు.

05/09/2016 - 12:39

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు రాత్రి దిల్లీ వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లో కరవు పరిస్థితులపై మంగళవారం నిర్వహించే సమావేశంలో కెసిఆర్ పాల్గొంటారు. ఈ సమావేశం తరువాత ప్రధానిని ఆయన ప్రత్యేకంగా కలుస్తారని సమాచారం. నీటి ప్రాజెక్టులు, కొత్త జిల్లాలు, నియోజకవర్గాల ఏర్పాటు, కేంద్ర నిధులు తదితర అంశాలను ఆయన ప్రధానికి నివేదించే అవకాశం ఉంది.

05/09/2016 - 08:24

హైదరాబాద్, మే 8: ఈనెల చివరి నాటికి 165 గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని, ఆగస్టు నాటికి మరో వంద గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై సచివాలయంలో మంత్రి ఆదివారం సమీక్ష జరిపారు. ప్రస్తుతం వంద గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పా రు.

05/09/2016 - 08:15

వెంకటాపురం, మే 8: తోటి స్నేహితులతో ఉయ్యాల ఊగుతుండగా ప్రమాదవశాత్తు దాని తాడు మెడకు బిగిసుకుని ఓ బాలిక దుర్మరణం పాలైన విషాద సంఘటన ఇది. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సున్నంబట్టీ వీధిలోని కోర్సా రాంబాబు, రాధల కుమార్తె సమత(7) ఆదివారం మధ్యాహ్నం ఇంటి వెనుక ఉన్న మామిడిచెట్టుకు కొబ్బరి తాడుతో ఉయ్యాల కట్టుకుని తోటి పిల్లలతో ఊగుతూ ఆడుతోంది.

05/09/2016 - 08:15

హైదరాబాద్, మే 8: ఇంజనీరింగ్ విద్యార్థిని కె.దేవిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. దేవిరెడ్డిని హత్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆమె ప్రమాదంలో మృతి చెందిందని వైద్యులు కూడా నిర్ధారించినట్లు పేర్కొన్నారు.

05/09/2016 - 08:14

ఖమ్మం, మే 8: రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం అదృశ్యమై, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు రవి, వివేక్, ఇనగాల వెంకటరెడ్డి ఆరోపించారు.

05/09/2016 - 08:13

హైదరాబాద్, మే 8 : తెలంగాణ రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం పెండింగ్‌లో పడిపోయింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూపొందించిన నిబంధనావళికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం పొందకపోవటంతో పథకాల అమలు పెండింగ్‌లో పడిపోయాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం గత రెండేళ్లలో రూ.20 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఈ నిధుల వినియోగానికి నియమావళిని ఆమోదించడంలో జాప్యం జరుగుతోంది.

05/09/2016 - 06:57

ఖమ్మం, మే 8: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి ఓటమి పాలైతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని కెటిఆర్ సవాల్ విసిరారు.

05/09/2016 - 06:55

ఖమ్మం, మే 8: రాజకీయ జ్ఞానం లేని మంత్రి కెటిఆర్ బచ్చా అని, ఉద్యమం పేరుతో ప్రజలను మోసగించి గద్దెనెక్కిన టిఆర్‌ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక అర్హత లేదని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ పాలేరులో గెలిస్తే రాజీనామా చేస్తానని కెటిఆర్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

05/09/2016 - 06:53

హైదరాబాద్, మే 8: అసంఘటిత కార్మికులకు శుభవార్త. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు కాబోతున్నాయి. కార్పోరేట్ తరహా వైద్య సేవలు అందించనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు.

Pages