తెలంగాణ

సంజీవయ్య పార్క్‌లో అతి పెద్ద జాతీయ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ వివిధ శాఖల అధికారులతో శనివారం సమన్వయ సమావేశం జరిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించిన అనంతరం ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సంజీవయ్య పార్కులో అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఉత్సవాలలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తారు.
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలలో బట్టల పంపిణీ, అస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అంధ విద్యార్థులకు పరికరాలు అందజేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎంజి గోపాల్, ముఖ్యకార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, శ్రీ్ధర్ సిన్హా, రామకృష్ణారావు, సునీల్ శర్మ, అదనపు డిజిలు శ్రీమతి తేజ్‌దీప్ కౌర్ మీనన్, సుధీప్ లక్టాకియా, పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ టి చిరంజీవులు, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా , దేశిపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.