S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/07/2016 - 05:55

హైదరాబాద్, మే 6: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ముందుకు రాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీకి 60 గ్రేడ్‌లో ఉన్న ముడి ఇనుము అవసరమని అధికారులు తెలిపారు. అయితే బయ్యారంలో లభిస్తున్న ముడి ఇనుము 30 గ్రేడ్‌లలో ఉందని అధికారులు తెలిపారు.

05/07/2016 - 05:54

హైదరాబాద్, మే 6: నూతనంగా ఏర్పాటుకానున్న జిల్లాల కలెక్టరేట్లు స్వరూపంపై కసరత్తు ప్రారంభమైంది. సిఎం కె చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశంపై కలెక్టరేట్ల స్వరూపం, భవన నిర్మాణాలు, వౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల సముదాయంగా కలెక్టరేట్లు నిర్మించాలని సిఎం నిర్ణయించారు.

05/07/2016 - 05:53

విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ ఆవరించిన ఉపరితల ద్రోణి శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణలో అల్లకల్లోలమే సృష్టించింది. చండప్రచండమైన గాలులు, ఉరుములు, మెరుపులతో రాష్ట్రాన్ని రెండు గంటల పాటు విసిరికొట్టిన వాన, అపార నష్టాన్ని మిగిల్చింది. అంతకుముందు వరకూ తీవ్రమైన ఉషోణ్రగతలతో అల్లాడిపోయన జనం, గురువారం సాయంత్రానికి చల్లబడిన వాతావరణంతో ఒకింత సేదతీరారు.

05/06/2016 - 18:12

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో తెరాస పోటీ చేయడంపై అభ్యంతరం చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు మానవత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి గత ఎన్నికల్లో పోటీ చేసినపుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి బరిలో నిలిచారని ఆయన గుర్తుచేశారు. అప్పుడు వారికి మానవత్వం గుర్తుకురాలేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

05/06/2016 - 18:11

వరంగల్: మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్దూరు మండలం దూల్మిట్టలో శుక్రవారం వెలుగు చూసింది. డబ్బులించేందుకు భార్య నిరాకరించడంతో కోల మల్లయ్య (39) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

05/06/2016 - 18:11

నిజామాబాద్: ఎఎస్‌ఐతో పాటు ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించినట్లు ఆరోపణలు రావడంతో నగర డిప్యూటీ మేయర్ ఎంఎ ఫరుూంపై స్థానిక వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇక్కడి బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ డిప్యూటీ మేయర్ కుమారుడు బషీర్ అద్నాన్ (24) వెళుతున్న బైక్‌ను ఆపారు.

05/06/2016 - 16:21

హైదరాబాద్: కేవలం 231 మండలాల్లోనే కరవు ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రం మొత్తాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కరవు సాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద సిపిఐ నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు.

05/06/2016 - 16:21

మెదక్: ఎపిలో నీటి ప్రాజెక్టుల విషయమై అక్కడ విపక్షాలన్నీ ఐక్యతను ప్రదర్శిస్తుండగా తెలంగాణలో విపక్షాలు నోరుమెదపడం లేదని మంత్రి హరీష్ విమర్శించారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై ఎపి అభ్యంతరాలు తెలిపితే భవిష్యత్‌లో ఆ రాష్ట్రానికే నష్టం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.

05/06/2016 - 14:29

మెదక్: బైక్‌పై రివ్వున వచ్చి 5 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగును లిప్తకాలంలో ఓ ఆగంతకుడు అపహరించుకుపోయాడు. సదాశివపేటలోని ఆంధ్రాబ్యాంకు వద్ద ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. మునిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన పాపయ్య ఆంధ్రాబ్యాంకు శాఖ నుంచి 5 లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. ఆ నగదును బ్యాగులో పెట్టుకుని బ్యాంకు బయటకు పాపయ్య రాగానే బైక్‌పై వచ్చిన ఆగంతకుడు క్షణంలో తన పని పూర్తి చేసుకుపోయాడు.

05/06/2016 - 14:28

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో కరవు ఫలితంగా రైతులు దీనావస్థలో ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలేరు ఉపఎన్నికపై దృష్టంతా నిలిపారని టి.టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఆరోపించారు. అనేక మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో తాము పరిశీలించగా కరవు పరిస్థితి భీతిగొలిపేలా ఉందన్నారు. కరవు సాయంపై సిఎం స్పందించనందున త్వరలో తాము దిల్లీ వెళ్లి ప్రధానికి వాస్తవ పరిస్థితులను నివేదిస్తామన్నారు.

Pages