తెలంగాణ

ఉక్కుపట్టు వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ముందుకు రాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీకి 60 గ్రేడ్‌లో ఉన్న ముడి ఇనుము అవసరమని అధికారులు తెలిపారు. అయితే బయ్యారంలో లభిస్తున్న ముడి ఇనుము 30 గ్రేడ్‌లలో ఉందని అధికారులు తెలిపారు. నాణ్యత తక్కువగా ఉన్నందున ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మాణానికి కేంద్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే కేంద్రం ఏ విషయం తేల్చి చెప్పిన తరువాత ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని అధికారులు అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగానికి సమీపంలోనే ఉన్న ఒరిస్సా నుంచి నాణ్యమైన ముడి ఇనుము లభిస్తోంది. దానివల్ల విశాఖలో ముడి ఇనుము తవ్వకాలు లేకపోయినా ఒరిస్సా వల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. బయ్యారంలో ఉక్కు కార్మాగారం నిర్మిస్తే పూర్తిగా స్థానికంగా లభించే ముడి ఇనుముపైనే ఆధారపడాలి. బయ్యారంలోని ముడి ఇనుము 30 గ్రేడ్‌లోనే ఉన్నా దాన్ని 60 గ్రేడులకు మార్చే ప్రక్రియ అందుబాటులో ఉందని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వ రంగంలో ఇది సాధ్యంకాదని, ప్రైవేటు రంగంలో సాధ్యమన్నది అధికారులు వాదన. కేంద్రం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తాము ఏర్పాటు చేస్తామని జిందాల్ ముందుకొచ్చిందని, మరి కొన్ని కంపెనీలూ ఆసక్తి చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్ని వ్యవహారాలు ప్రైవేటు వారికి సాధ్యమవుతాయని, ప్రభుత్వరంగంలో నష్టంగా కనిపించేవి కూడా ప్రయవేట్ వర్గాలు లాభసాటిగా నడిపించగలవని అధికారులు చెబుతున్నారు. అయతే, కేంద్రం ముందుకొచ్చినా రాకున్నా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఖాయం అని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్నప్పుడు బయ్యారం ఉక్కు గనులను దోచి పెట్టేశారని ప్రచారం చేసినా, నిజానికి అక్కడ అంత నాణ్యమైన ముడి ఇనుము లేదని అధికారులు అంటున్నారు. బయ్యారంలో ప్రైవేటు రంగంలోనే ఉక్కు కర్మాగారం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సర్వే జరిపేందుకు కేంద్రానికి మరో ఏడాది గడువుందని, ఏడాది తరువాతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు.