తెలంగాణ

అదీ కలెక్టరేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: నూతనంగా ఏర్పాటుకానున్న జిల్లాల కలెక్టరేట్లు స్వరూపంపై కసరత్తు ప్రారంభమైంది. సిఎం కె చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశంపై కలెక్టరేట్ల స్వరూపం, భవన నిర్మాణాలు, వౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల సముదాయంగా కలెక్టరేట్లు నిర్మించాలని సిఎం నిర్ణయించారు. అత్యవసరంగా ఉపయోగించడానికి వీలుగా కలెక్టరేట్‌లోనే హెలిఫ్యాడ్‌లూ ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో నూతనంగా 14నుంచి 15 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కొత్త జిల్లాల కలెక్టరేట్లను ఆధునికంగా నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. విశాలమైన గదులతో ఎత్తయిన పూర్వపు బంగళాలను పోలిన నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలూ ఒకేచోటకు చేరుస్తూ కలెక్టరేట్ల స్వరూపం ఉండాలని నిర్ణయించారు. జిల్లా కార్యనిర్వాహక అధికారులుగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తోన్న కలెక్టర్లు తెలంగాణ అభివృద్ధిలో మరింత కీలక భూమిక పోషించే సమయం ఆసన్నమైందని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే జిల్లా కలెక్టర్లకు పాలనకు తగ్గట్టుగా వౌలిక సౌకర్యాలు మెరుగుపర్చి వారిని మరింత బలోపేతం చేయనున్నామని సిఎం అన్నారు. నూతనంగా ఏర్పాటుకానున్న జిల్లా కేంద్రాల్లో ‘స్టేట్ ఆఫ్ ద ఆర్ట్’ తరహాలో వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలను ఒకేచోటకు చేర్చి కేంద్రీకృత కలెక్టర్ ఆఫీసులను నిర్మించేందుకు సిఎం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల కల్టెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆర్కిటెక్టులతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. సమగ్ర పాలన అందాలంటే వివిధ ప్రభుత్వ విభాగాలు ఒకేచోట అందుబాటులో ఉండాలని, దీనికి కలెక్టరు కార్యాలయం కేంద్రంగా ఉండాలని సిఎం సూచించారు. ఇరుకిరుకు గదుల్లోకాకుండా ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో పని చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరు కార్యాలయాలు నేటి అవసరాలకు తగ్గట్టుగా లేవన్నారు. రేపు నిర్మించే కలెక్టరు కార్యాలయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సిఎం అభిప్రాయపడ్డారు.
రెవెన్యూ, విద్యా, ఉద్యోగ, సంక్షేమ, సహకార, ఆరోగ్య శాఖ తదితర నిత్వావసర శాఖలతో ప్రజలకు నిత్యం పని ఉంటుందని, వీటన్నింటినీ కలెక్టరేటు కేంద్రంగా ఒకేచోట నిర్మిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తమ పనులు చేసుకోవడానికి సులువవుతుందని అన్నారు. 30 ఆఫీసులు ఒకేచోట
పోలీసు డిపార్ట్‌మెంట్ కార్యాలయాలు, జిల్లా పరిషత్, ట్రాన్స్‌కో, ఆర్టీసి, కోర్టులు తదితర కొన్ని కార్యాలయాలు వినా దాదాపు 30శాఖలకు చెందిన వివిధ కార్యాలయాలు ఒకేచోట ఉండబోతున్నాయని సిఎం అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల విలువైన సమయం ఆదా అవ్వడంతోపాటు, పనిలో నాణ్యత పెరుగుతుందన్నారు. ప్రజలతో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఎక్కువమంది కూర్చునేలా సమావేశ మందిరాలు నిర్మిద్దామని సూచించారు.
హెలీప్యాడ్
అత్యవసర ప్రమాద సమయాల్లో కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా హెలీక్యాప్టర్‌లో ప్రయాణించేందుకు వీలుగా హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సిఎం సూచించారు. ఒకప్పుడు హెలీక్యాప్టర్ అంటే లగ్జరీగా చూసేవారని, అలాంటి హెలీక్యాప్టర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం వినియోగిస్తోందన్నారు. సందర్శకుల వాహనాల పార్కింగ్ విశాలమైన ప్రాంతంలో నిర్మించాలని, పచ్చని గార్డెన్లను తలపించేలా పూల మొక్కలతో కలెక్టర్ ప్రాంగణం నిండిపోవాలని అన్నారు. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాలకు పంచాయితీరాజ్ కార్యాలయాలను మొక్కుబడిగా వాడే విధానం నుంచి బయటపడాలన్నారు. నూతనంగా నిర్మించే కలెక్టర్ ఆఫీసులకు పూర్తిస్థాయిలో ఆఫ్టిక్ ఫైబర్‌ను ఉపయోగించాలని, అన్ని కలెక్టర్ కార్యాలయాలు ఒకే పోలికతో కూడిన ఆర్కిటెక్ట్ డిజైన్ ఉండాలన్నారు. వాటర్ హార్వెస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. అవసరమున్నచోట ఇప్పుడున్న జిల్లా కేంద్రాల్లోనూ కొత్త కార్యాలయాలు నిర్మించనున్నారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకే సిఎం అప్పగించారు.
సమీక్షా సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, మెదక్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి తదితరులు పాల్గొన్నారు.