తెలంగాణ

‘కాళేశ్వరం’పై ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 7: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్ఫంతో గోదావరి జలాలను వినియోగించుకునేందుకు మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తే, ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టుపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజల పక్షాన నిలబడతారో..రాజకీయం చేస్తారో తేల్చుకోవాలని ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. శనివారం జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాకలో శ్రీలక్ష్మినర్సింహ సాగర్ రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలాన్ని, నంది మేడారం శివారులో తవ్వుతున్న సొరంగాలను, పంప్‌హౌస్‌లను ఆ యన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కాం గ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఎందు కు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సమర్ధిస్తే జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చంద్రబాబుకు లేఖ రాయాలని అన్నారు. సిఎం కెసిఆర్‌పై జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పదేపదే విమర్శలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రాజెక్టులన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ మాసంలో కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను సిఎం కెసిఆర్ సందర్శించి పరిశీలిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ గుండెకాయ లాంటిదని, ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.