S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/27/2016 - 03:26

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో నిరంతర సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్‌ఏ) పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్చింది. త్రైమాసిక , అర్ధవార్షిక , వార్షిక పరీక్షల స్థానే నిరంతర సంగ్రహణాత్మక మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించబోతోంది. అందులో 80 మార్కులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం, 20 మార్కులకు నిర్మాణాత్మక మూల్యాంకనం జరుగుతుంది. తొలుత ఈ పరీక్షలు అక్టోబర్ 22 నుండి నిర్వహించాలని భావించారు.

09/27/2016 - 03:25

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వర్షబీభత్సం, నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన నివేదికను కేంద్రానికి పంపిస్తే, అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. సోమవారం తన నివాసంలో బిజెపి ప్రజాప్రతినిధులతో, పార్టీ ఇతర నాయకులతో సమావేశమై చర్చించారు.

09/27/2016 - 03:24

హైదరాబాద్, సెప్టెంబర్ 26: హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. నాలుగు ఫోన్ నెంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగుచర్యలు తీసుకుంటున్నట్టు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తెలిపారు.

09/27/2016 - 03:24

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల పరీక్ష ఫీజుల గడువును బోర్డు ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 28 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను సమర్పించాలని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు. వచ్చే నెల 29వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకూ 100 రూపాయల జరిమానాతో ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.

09/27/2016 - 05:11

భద్రాచలం, సెప్టెంబర్ 26: ఖమ్మం జిల్లా భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకల్యాణమూర్తుల ఆభరణాల మాయం, తిరిగి దొరకడం వంటి సంఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

09/26/2016 - 05:32

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భారీ వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయింది అన్నట్టుగా చానళ్లలో ప్రచారం కావడంతో వరద బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో సహాయంకోసం అర్థిస్తున్న పరిస్థితులు లేవు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెట్‌జన్ల విసుర్లు చక్కర్లు కొడుతున్నాయి.

09/26/2016 - 05:31

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అనుభవంతో వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు సతీమణి చెన్నమనేని లలితా దేవి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె తనయుడు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, వారి కుటుంబ సభ్యులు 12వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/26/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ముస్లిం పర్సనల్ లా బోర్డులోని ట్రిపుల్ ‘తలాఖ్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్సనల్ లా బోర్డులోని ‘తలాఖ్’ అంశంపై ముస్లిం మహిళల్లో రగడ కొనసాగుతోంది. నిరక్షరాస్యత, పేదరికంతో ముస్లిం పర్సనల్ లాలోని తలాఖ్ అనే షరియత్ జీవించే హక్కును హరింపజేస్తోందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

09/26/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాల వల్ల సహాయక చర్యలు చేపట్టడంలో మంత్రులు, అధికార యంత్రాంగం తలమునకలై ఉండటంతో సోమవారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

09/26/2016 - 03:14

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దేశంలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపిఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐఎఎస్ ఖాళీలు 1470, ఐపిఎస్ 906 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కృష్ణయ్య ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం వెంటనే యుపిఎస్‌సి ద్వారా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Pages