తెలంగాణ

ప్రహసనంగా వరద బాధితుల సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భారీ వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయింది అన్నట్టుగా చానళ్లలో ప్రచారం కావడంతో వరద బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో సహాయంకోసం అర్థిస్తున్న పరిస్థితులు లేవు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెట్‌జన్ల విసుర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా నిజాంపేటలోని భండారి లేఔట్, అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో వరద బాధితులను ఆదుకోవడానికి వచ్చే వారితో అక్కడ జాతర వాతావరణం తలపిస్తోంది.
‘‘రోడ్‌స్టార్‌లో ఒకరు పులిహోర పెట్టారు. జనాలు రోజూ పులిహోరా మాకు వద్దు అన్నట్టు ఉన్నారు. ఇంకొకరు పక్కనే చపాతి, పప్పు పెట్టారు. ఇంకో పంచగిరి భక్త సమాజం ఫ్రైడ్‌రైస్, ఇంకో ఆర్యవైశ్య సంఘం బిర్యాని పెట్టింది. బ్యానర్స్ దగ్గర అంకుల్ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకొకరు ఆటోలో ఈసారి అన్నం పప్పు, కూరలు, వీల్ చిప్స్ వేసుకుని వరద బాధితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంకో ఆవిడ గుడ్ డే బట్టర్ బిస్కట్లు తీసుకొచ్చి బిస్కట్లు పంచాలని చూస్తున్నారు. పక్కనే కమెరా పట్టుకొని దేభ్యం మొహం ఒకరు. అంకుల్ అనుకుంటా. పాపం ఎంత కష్టపడ్డా వరద బాధితులు దొరకడం లేదు. అర్జెంట్‌గా వరద బాధితులు కావాలి. టీవి గొట్టాలు ఇక్కడ నుంచి జంప్ కొట్టాయి. ‘‘మేము మాత్రం అభిరుచి నుంచి 65 కూర, పప్పు, గోంగూర, పెరుగు తెచ్చుకుని అన్నం వండుకు తిన్నాం’’ బండారి లే ఔట్‌లో ఉండే కృష్ణ మోహన్ ఫేస్‌బుక్‌లో తమ ప్రాంతంలోని వరద బాధితుల సహాయంకోసం వచ్చిన వారి గురించి రాసిన పోస్ట్. బండారి లేఔట్‌లో సెల్లార్‌లోని నీళ్లు రావడం వల్ల వరద ప్రభావం ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది.
అయితే ఆ ప్రాంతంలోని ఎక్కువ మంది సంపన్నులు, ఎగువ మధ్య తరగతికి చెందినవారే. వరద సమస్యతో పలువురు కూకట్‌పల్లిలోని హోటల్స్‌లోకి మకాం మార్చారు. భారీ వర్షాలు కురిసినంత మాత్రాన వరద బాధితులను ఆదుకొనేందుకు వచ్చేవారికోసం ఎదురు చూసే స్థితిలో ఉన్నవారు తక్కువ. బండారి లేఔట్ వరద బాధితుల గురించే మీడియాలో ఎక్కువ ప్రచారం జరగడంతో జాతరలా సహాయ సంస్థలు ఇక్కడికి వస్తున్నా ఇక్కడి ఫ్లాట్స్‌లో ఉండే యజమానులు వీరు పంచే ఆహారం తీసుకోవడం లేదు. స్వచ్ఛంద సంస్థలను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇక ఫ్లాట్ల యజమానులు ఉప్మా, పూరీ, పులిహోరా అంటూ మీరు రావలసిన అవసరం లేదు. ఆరు రోజుల నుంచి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను బయటకు పంపించండి చాలూ అని వేడుకుంటున్నారు. బండారి లే ఔట్‌లో పరిస్థితి ఇలా ఉండడంతో పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు భూదేవి నగర్‌లోని గుడిసె వాసులపై దృష్టి సారించారు. ఆదివారం రోజు భూదేవి నగర్‌లోని గుడిసె వాసుల ప్రాంతం జాతరను తలిపించే విధంగా మారింది. ఒకేరోజు 15 సంస్థలు ఆహారం, బిస్కట్లు, నీళ్లతో వచ్చి సహాయం చేసేందుకు పోటీ పడ్డాయి. ఇక్కడ 300 వరకు గుడిసెలు ఉండగా, నాలా పొంగి ప్రవహించడం వల్ల పది గుడిసెలు నీటిలో మునిగాయి. ఈ ప్రాంతం స్వచ్ఛంద సంస్థల ప్రవాహంతో సందడిగా మారింది.