తెలంగాణ

అనుభవంతో వ్యక్తిత్వ వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అనుభవంతో వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు సతీమణి చెన్నమనేని లలితా దేవి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె తనయుడు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, వారి కుటుంబ సభ్యులు 12వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆమె మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించారు. లలితా దేవి గురించి ‘స్వాతంత్య్ర సమరశీలి చెన్నమనేని లలితా దేవి..’ పేరిట డాక్టర్ చెన్నమనేని పద్మ రాసిన పుస్తకాన్ని స్పీకర్ మధుసూదనా చారి ఆవిష్కరించారు. అనంతరం స్పీకర్ ప్రసంగిస్తూ ఉద్యమకారుడైన చెన్నమనేని రాజేశ్వర రావుకు భార్య లలితా దేవి చేదోడువాదోడుగా నిలిచి ప్రోత్సహించారని చెప్పారు. మహిళల్లో అంతగా చైతన్యం లేని రోజుల్లోనే లలితమ్మ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు.
లలితమ్మ విలువలను కొంతైనా పాటిస్తే జన్మ చరితార్థం అవుతుందని స్పీకర్ తెలిపారు. లలితమ్మ అపూర్వ వ్యక్తిత్వం కలిగి ఉండే వారని, వ్యక్తిత్వ వికాసం అనుభవంతోనే వస్తుందని ఆయన అన్నారు.
యువతకు చరిత్ర తెలవాలి: కెటిఆర్
రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రసంగిస్తూ చెన్నమనేని లలిత జీవిత చరిత్ర గురించి పుస్తకం తేవడం గొప్ప విషయమని, చరిత్ర తమలాంటి యువతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎంపి వినోద్‌కుమార్ ప్రసంగిస్తూ లలితమ్మ ఇంటి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని తెలిపారు. లోగడ తాను ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళేవాడినని ఆయన చెప్పారు.
ఈ పుస్తకం ఇంకా 15 ఏళ్ళ ముందే ప్రచురించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్వాగతోపన్యాసం చేశారు. ఇంకా ఎంపీలు కె. కేశవరావు, బి. సుమన్ తదితరులు పాల్గొన్నారు.