S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/25/2016 - 04:31

డోర్నకల్, సెప్టెంబర్ 24: ముంబయ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎస్ 12 బొగీ వద్ద రైలు చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన గార్ల గెట్‌మెన్ వెంటనే విషయాన్ని వరంగల్ జిల్లా డోర్నకల్ ఆర్‌ఆర్‌ఐ మాస్టర్‌కు సమాచారం ఇవ్వడంతో డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

09/25/2016 - 04:29

పాపన్నపేట, సెప్టెంబర్ 24: ఏడుపాయల ఘణపురం ప్రాజెక్ట్‌లో మంజీరా పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతుంది. పరీవాహక ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురియడం, సింగూర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీరు విడుదల అవడంతో ఘణపురం ప్రాజెక్ట్‌పై నుంచి ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందునుంచి ప్రమాద స్థాయిలో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీ ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

09/25/2016 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్రంకోసం జీవితాంతం పాటుపడ్డ కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర కార్యక్రమం (స్టేట్ ఫంక్షన్) గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక జీఓ జారీ చేశారు. ఈ నెల 27న బాపూజీ 101వ జయంతి జరుపుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

09/25/2016 - 03:41

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో, వరదలతో సతమతమవుతున్న జంట నగరాల ప్రజలను పరామర్శించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగు దేశం నాయకులు పోటీ పడ్డారు. అల్వాల్, భూదేవీ నగర్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీ్ధర్ తదితరులు పర్యటించారు.

09/24/2016 - 16:58

నిజామాబాద్ : మద్నూర్ మండలంలో లెండివాగు ఉధృతికి ఎన్‌గురా, ఇలుగాం, కుర్ల, గోజేగాం, మదన్ ఇప్పర్గా గ్రామాలు శనివారం నీట మునిగాయి. భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటపొలాలు నీటి మునిగాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

09/24/2016 - 16:52

హైదరాబాద్‌: నగరంలోని వరద బాధితులకు 'మా' ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) ఆధ్వర్యంలో శనివారం ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. 'మా' అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా ఆల్విన్‌ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

09/24/2016 - 16:32

హైదరాబాద్‌: నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు శనివారం రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నిజాంపేట, హకీంపేట, ఆల్వాల్‌, బేగంపేట సహా పలు ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

09/24/2016 - 16:25

మెదక్: నారాయణ్‌ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో వాగులో చిక్కుకున్న శ్రీనివాస్ అనే యువకుడు శనివారం గల్లంతయ్యాడు. కంగ్టి మండలం నాగూర్‌బిలో భారీ వర్షాలకు గోడ కూలి ఒక వృద్ధుడు మృతి చెందాడు.

09/24/2016 - 16:18

హైదరాబాద్‌: వర్షాల నేపథ్యంలో వాటిల్లిన పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. దిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి శనివారం మంత్రులు తలసాని, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులతో వరదల పరిస్థితిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

09/24/2016 - 14:20

హైదరాబాద్: బస్తీ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను రాజేంద్రనగర్‌లో శనివారం ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Pages