తెలంగాణ

భద్రాచలం ఈఓ దిద్దుబాటు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 26: ఖమ్మం జిల్లా భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకల్యాణమూర్తుల ఆభరణాల మాయం, తిరిగి దొరకడం వంటి సంఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథచార్యులు, సీతారామానుజాచార్యులను ఆభరణాల పర్యవేక్షణ బాధ్యతల నుంచి తొలగించిన ఈఓ తాజాగా వారిని ప్రధానాలయంలో విధుల నుంచి కూడా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జగన్నాథాచార్యులును ఉపాలయం గోవిందరాజస్వామి ఆలయానికి, సీతారామానుజాచార్యులును మరో ఉపాలయం నృసింహస్వామి ఆలయానికి మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని దేవస్థానం డిఇ రవీంద్రను ఆదేశిస్తూ ఈఓ రమేశ్‌బాబు మరో ఉత్తర్వు జారీ చేశారు.
దొరికిన నగలతో ప్రధానార్చకులు, ఈఓ (ఫైల్ ఫొటో)