తెలంగాణ

విద్యుత్ శాఖ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. నాలుగు ఫోన్ నెంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగుచర్యలు తీసుకుంటున్నట్టు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ యాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. సమర్ధవంతంగా సేవలందించేందుకు రెగ్యులర్ సిబ్బందికి అదనంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఫోన్ నెం. 7382072104, 7382072106, 7382071574, 9490619846లతోపాటు 1912,100 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సిఎండి రఘురామ్ పేర్కొన్నారు.