తెలంగాణ

పునర్విభజన తుది నోటిఫికేషన్‌లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాల వల్ల సహాయక చర్యలు చేపట్టడంలో మంత్రులు, అధికార యంత్రాంగం తలమునకలై ఉండటంతో సోమవారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వర్షాలు, వరద సహాయక చర్యలు చేపట్టడం కోసం మంత్రులంతా తమ తమ జిల్లాల్లోనే ఉండాల్సిందిగా ఆదేశించడంతో మంత్రిమండలి సమావేశాన్ని రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశంలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాల పునర్విభజన ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలపై మంత్రిమండలి చర్చించి తుది నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. పునర్విభజనపై ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి ఈ నెల 21న సాయంత్రమే గడువు ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు రోడ్ మ్యాప్ ప్రకారం ఈ నెల 22 తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే నదీ జలాల పంపిణిపై అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఈ నెల 21న ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లడంతో మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 26న ఏర్పాటు చేసింది. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం కావడంతో మంత్రిమండలి సమావేశాన్ని వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ విభజనపై విడుదల కావాల్సిన తుది నోటిఫికేషన్‌లో జాప్యం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ దసరా నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు పని చేసే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.