తెలంగాణ

ట్రిపుల్ ‘తలాఖ్’పై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ముస్లిం పర్సనల్ లా బోర్డులోని ట్రిపుల్ ‘తలాఖ్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్సనల్ లా బోర్డులోని ‘తలాఖ్’ అంశంపై ముస్లిం మహిళల్లో రగడ కొనసాగుతోంది. నిరక్షరాస్యత, పేదరికంతో ముస్లిం పర్సనల్ లాలోని తలాఖ్ అనే షరియత్ జీవించే హక్కును హరింపజేస్తోందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్ ఖాన్ ముస్లిం పర్సనల్ లా బోర్డును సవరించే విధంగా లేఖలు రాశారు. ఇటీవల పర్సనల్ లాపై సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలైంది. ట్రిపుల్ తలాఖ్‌పై దాఖలైన పిల్‌పై ఈ వారంలో కోర్టులో విచారణకు వచ్చే అవకాశం న్నట్టు ఆబిద్ రసూల్ ఖాన్ తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ పేరుతో దేశంలోని అనేక మంది ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని, మహిళలు గృహ హింస, వేధింపులు, భర్తల చేతుల్లో భౌతిక దాడులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తనకు ఎన్నో ఫిర్యాదులు, కేసులు వచ్చాయని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అమాయక ముస్లింలు తమ భర్తలు పెట్టే చిత్రహింసలు, అత్తమామల వేధింపులతో తలాఖ్.. తలాఖ్.. తలాఖ్.. అని మూడుసార్లు చెబుతూ మహిళలను వదిలేస్తుండడం, అనంతరం వారికి కుటుంబ నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడం వంటి అంశాలలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భార్యా, భర్తల అంగీకారంతో, మనోవర్తి చెల్లించే విధంగా తలాఖ్ తీసుకుంటే ఫర్వా లేదన్నారు. కానీ బలవంతంగా ఏకపక్ష నిర్ణయంతో తలాఖ్ అంటూ మూడుసార్లు ఓ పెద్దల సమక్షంలో చెబుతూ భార్యలను వదిలించుకోవడం సమంజసం కాదన్నారు. లా బోర్డులోని కొన్ని లొసుగులతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, లా బోర్డులోని ఈ ట్రిపుల్ తలాఖ్ అంశం దుర్వినియోగమవుతోందని అబిద్ రసూల్ ఖాన్ తెలిపారు. ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా తలాఖ్ విషయమై చర్చించాలని ముస్లిం మైనార్టీ కమిషన్ చైర్మన్ సుప్రీం కోర్టును కోరారు.