తెలంగాణ

పరీక్షల షెడ్యూలులో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో నిరంతర సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్‌ఏ) పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్చింది. త్రైమాసిక , అర్ధవార్షిక , వార్షిక పరీక్షల స్థానే నిరంతర సంగ్రహణాత్మక మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించబోతోంది. అందులో 80 మార్కులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం, 20 మార్కులకు నిర్మాణాత్మక మూల్యాంకనం జరుగుతుంది. తొలుత ఈ పరీక్షలు అక్టోబర్ 22 నుండి నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా ఈ పరీక్షలను అక్టోబర్ 27 నుండి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 27న 9,10 తరగతులకు గణితం-1,గణితం -2 ఉంటాయి.
8వ తరగతికి గణితం, 6,7 తరగతులకు ఫస్టు లాంగ్వేజి, 1 నుండి 5 వరకూ ఫస్టులాంగ్వేజి జరుగుతుంది. 28న 9,10 తరగతులకు పిఎస్, బయాలజీ, 8వ తరగతికి సైన్స్, 6,7 తరగతులకు సెకండ్‌లాంగ్వేజి, 1 నుండి 5 తరగతులకు ఇంగ్లీషు జరుగుతుంది. అక్టోబర్ 31న 1 నుండి 5 తరగతులకు మాథ్స్, 6,7 తరగతులకు ఇంగ్లీషు, 8వ తరగతికి సోషల్, 9,10 తరగతులకు ఎస్‌ఎస్-1, ఎస్‌ఎస్-2 జరుగుతాయి. నవంబర్ 1న 1 నుండి 5 తరగతులకు ఇవిఎస్, 6,7 తరగతులకు ఎస్‌ఎస్, 8వ తరగతికి ఫస్టు లాంగ్వేజి, 9,10 తరగతులకు ఫస్టు లాంగ్వేజి జరుగుతుంది. ఇక నవంబర్ 2న 6,7 తరగతులకు మాథమెటిక్స్, 8వ తరగతికి సెకండ్ లాంగ్వేజి, 9,10 తరగతులకు థర్టు లాంగ్వేజి పేపర్-1, పేపర్-2 జరుగుతాయి. నవంబర్ 3న 6,7 తరగతులకు జనరల్ సైన్స్, 8వ తరగతికి థర్టు లాంగ్వేజి , 9,10 తరగతులకు సెకండ్ లాంగ్వేజి పరీక్షలు జరుగుతాయి.