S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/28/2015 - 05:18

విశాఖపట్నం, నవంబర్ 27: గిరిజనుల అంగీకారంతోనే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు.

11/28/2015 - 07:25

చంద్రగిరి, నవంబర్ 27: లోకేష్, బ్రహ్మణి దంపతుల పుత్రుడు దేవాంశ్‌కు శుక్రవారం ఉదయం నాగాలమ్మ గుడివద్ద కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. ఉదయం 9.15గంటలకు నారావారి పల్లె నుంచి చంద్రబాబు నాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు, , లోకేష్ దంపతులు వాహనాల్లో నాగాలమ్మ గుడికి చేరుకున్నారు. చంద్రబాబు తన మనుమణ్ని ఎత్తుకుని ఆలయంలోకి దారితీశారు.

11/28/2015 - 05:16

హైదరాబాద్, నవంబర్ 27: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా కోటి ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం సాయంత్రానికి ఎపిలో కోటి బల్బుల పంపిణీ పూర్తయినట్లు ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇందుకు కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియూష్ గోయల్ ఎపి సిఎం చంద్రబాబునాయుడును అభినందించారు.

11/28/2015 - 05:15

హైదరాబాద్, నవంబర్ 27: ప్రాథమిక విద్యను గాడిలో పెట్టి తరగతి గదిలో నైతిక విలువలను బోధించడం, విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, చదువుపట్ల ఆసక్తి, పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు కావలసిన సలహాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలికి చైర్మన్‌గా చాగంటి కోటేశ్వరరావువ్యవహరిస్తారు.

11/28/2015 - 05:14

గుంటూరు, నవంబర్ 27: కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం వరకు నాలుగులేన్ల రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణను ప్రారంభించిన సమయంలో నిద్రలేని రాత్రుళ్లు గడిపిన వివిధ గ్రామాల ప్రజలు..మళ్లీ అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానిస్తున్నారు.

11/28/2015 - 05:09

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు సచివాలయంలో విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సమయం ఉదయం 9 నుండి 12 వరకూ
మార్చి 2 సెకండ్ లాంగ్వేజి-1
మార్చి 4 ఇంగ్లీషు పేపర్-1
మార్చి 8 మాధ్స్ 1ఎ
బోటనీ -1
సివిక్స్-1
సైకాలజీ-1

11/28/2015 - 04:49

హైదరాబాద్, నవంబర్ 27: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రలో తమ సేవలను అందించడం లేదన్న అంశంపై విచారణ జరిగిన సందర్భంలో ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లు పరస్పర ఆరోపణలు చేసుకోవడంపట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 4న తాము ఇచ్చిన ఆదేశాలపై ఇరు రాష్ట్రాలు తీసుకున్న చర్యలు ఏమిటని హైకోర్టు నిలదీసింది.

11/28/2015 - 04:44

విజయవాడ, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తాజాగా ఇసుక విధానం, బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన శే్వతపత్రాలపై విమర్శలు చేయడం సరైందికాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అవినీతి డబ్బుతో ఏర్పాటైన మీడియాకు అలాగే అలాంటి రాజకీయ పార్టీలకు ఎప్పుడూ అవినీతి ఆలోచనలే తప్ప వాస్తవాలు ఎలా రుచిస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు.

11/28/2015 - 04:42

రేణిగుంట, నవంబర్ 27: రాష్ట్రంలో హార్డ్‌వేర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, తిరుపతి-చెన్నయ్-నెల్లూరుల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధిపథంలో నడిపిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటి హబ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర మొబైల్‌హబ్ తొలి యూనిట్‌ను సిఎం ప్రారంభించారు.

11/28/2015 - 04:42

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దినేశ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి క్యాడర్‌కు చెందిన దినేశ్‌కుమార్ గతంలో కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డిప్యూటేషన్‌పై వెళ్లారు.

Pages