S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/28/2015 - 04:41

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కలిసి కమిషన్ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉదయ భాస్కర్‌ను కలిసి అభినందించారు.

11/28/2015 - 04:41

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యావిభాగాలపై వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో సమీక్ష నిర్వహించనున్నట్టు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని విద్యా శాఖల స్థితిగతులను అధ్యయనం చేస్తారని అన్నారు.

11/28/2015 - 04:40

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉపాధ్యాయుల పరస్పర, స్పౌజ్ కేటగిరిలో అంతర్‌జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా చెప్పారు. పరస్పర , స్పౌజ్ అంతర్ జిల్లాల బదిలీలకు ప్రతిపాదనలు వస్తే ఎప్పటికపుడు జిఎడి అనుమతి తీసుకుని వాటిని అమలుచేస్తామని పేర్కొన్నారు.

11/28/2015 - 04:40

హైదరాబాద్, నవంబర్ 27: రాయలసీమకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనని రాయలసీమ యూత్‌ఫోర్స్ కన్వీనర్ మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు. సీమ జిల్లాలను దేశంలోనే అభివృద్ధి చెందిన జిల్లాలుగా తీర్చిదిద్దాలనే మహాసంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు. రాయలసీమకు ఎవరు ఏం చేశారో తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడ్డం సరికాదని ఆయన ఒక ప్రకటనలో హితవు పలికారు.

11/28/2015 - 04:39

విశాఖపట్నం, నవంబర్ 27: మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం రక్షణ రంగం సహా, ఇతర తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేస్తోందని ఐసిఎఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ఉపాధ్యక్షుడు మానస్ కుమార్ ఠాకూర్ చెప్పారు.

11/28/2015 - 03:42

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ రాష్టస్థ్రాయి కార్యాలయాలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లోగా అధికారులు, కార్యాలయాలు, రికార్డులు విజయవాడకు మారాలని సంబంధిత శాఖ సీనియర్ అధికారులు ఆదేశాలిచ్చారు. ఈమేరకు విజయవాడ నుంచి బందరుకు వెళ్లే దారిలో సిరీస్‌కు సమీపంలో ఒక పెద్ద భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది.

11/28/2015 - 03:40

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షలు మార్చి 21నుంచి ఏప్రిల్ 7 వరకూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 21 వరకూ జరగనున్నాయి. టెన్త్ పరీక్షలకు రెగ్యులర్ అభ్యర్ధులు 6.2 లక్షల మంది, ప్రైవేటు అభ్యర్థులు 41వేల మందితో కలిపి 6.61 లక్షల మంది హాజరుకానున్నారు. ఎస్సెస్సీ ఒకేషనల్ పరీక్షలకు మరో 25వేల మంది హాజరవుతున్నారు. వీరందరికీ ఇప్పటికే హాల్‌టిక్కెట్లు జారీ చేశారు.

11/28/2015 - 03:38

చంద్రగిరి, నవంబర్ 27: ఆంధ్రలో నదుల అనుసంధానం ద్వారా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన మనుమడు దేవాన్ష్‌కు స్వగ్రామంలో పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం ఆయన కల్యాణి డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం గేటు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. అనంతరం గంగ పూజ చేసి హారతులిచ్చారు.

11/28/2015 - 03:33

విజయవాడ, నవంబర్ 27: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధిరేటు సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి హైదరాబాద్ సచివాలయంలో శనివారం జరిగే ఉన్నతాధికారుల సమావేశం దిశానిర్దేశం చేయనుంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, లక్ష్య సాధనకు నిధుల అవసరమెంతో లెక్కించడం, వనరుల సమీకరణ తదితర అంశాలపై స్పష్టతకు రావడం స్థూలంగా శనివారం జరగబోయే సమావేశం ఉద్దేశాలు.

11/28/2015 - 03:32

హైదరాబాద్, నవంబర్ 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపుతిరిగింది. జంట రాష్ట్రాలను ఒక కుదుపు కదిపేసిన కేసు వ్యవహారం శుక్రవారం కీలక దశకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే.

Pages