రాష్ట్రీయం

ఆ గొంతు రేవంత్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపుతిరిగింది. జంట రాష్ట్రాలను ఒక కుదుపు కదిపేసిన కేసు వ్యవహారం శుక్రవారం కీలక దశకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) తాజాగా స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వీడియో విచారణలో ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, తెదేపా నేత జెరూసలెం మత్తయ్య వాయిస్‌తో సరిపోలినట్టు ఉందని నివేదికలో నిర్ధారించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను ఫోరెనిక్స్ ల్యాబ్ అధికారులు కోర్టుకు సమర్పించారు. స్వర నిర్ధారణకు సంబంధించిన నివేదికను తమకు కూడా ఇవ్వాలని ఏసిబి కోరనుంది. అయితే స్టీఫెన్‌సన్‌తో ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు కూడా మాట్లాడినట్టు ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్ష కోసం చంద్రబాబు వాయిస్ నమూనాను కూడా సేకరించాలని ఏసిబి భావిస్తున్నట్టు సమాచారం. గత మే 30న సికింద్రాబాద్ బోయిగుడాలోని బిషప్‌హారీ సెబాస్టీయన్ నివాసంలో రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సిన్హా మాటలను ఐఫోన్, డిజిటల్ రికార్డర్ల ద్వారా రహస్యంగా రికార్డు చేయించారు. మరుసటి రోజు మే 31న విక్రంపురి కాలనీలోని తన మిత్రుడు మాల్కమ్‌టేలర్ నివాసంలోనూ టిడిపి నాయకుల మాటలను రికార్డు చేశారు. ఈ సందర్భంగా సెబాస్టియన్ ఫోన్‌లో రికార్డైన వాటిని కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో ఎసిబి దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది.