S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/27/2015 - 06:00

వైకాపా అధినేత వైఎస్ జగన్ ధ్వజం

11/27/2015 - 05:59

సకాలంలో సరసమైన ధరకు ఇసుక
జనవరి 1 నుండి నూతన విధానం అమలు
ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగంపై దృష్టి
అక్రమ తవ్వకాలకు చెక్
శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

11/26/2015 - 18:16

హైదరాబాద్: అగ్రీగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రీగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి గతంలో హైకోర్టు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సోమవారం కోర్టుకు హాజరుకావాలని ఎమ్ఎస్ టీసీ ప్రతినిధులను కోర్టు ఆదేశించింది.

11/26/2015 - 08:23

హైదరాబాద్, నవంబర్ 25: ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుందని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి అన్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం 11వ రోజు బుధవారం అంగరంగంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేసారు. ధర్మరక్షణ ద్వారానే లోకరక్షణ జరుగుతుందని అన్నారు.

11/26/2015 - 08:21

హైదరాబాద్, నవంబర్ 25: రైల్వే చరిత్రలో తొలిసారిగా పర్యావరణ రహిత, విద్యుత్ పొదుపును దృష్టిలో ఉంచుకుని తమ కార్యాలయాల్లో సహజ వెలుతురు (డే లైట్ పైప్ టెక్నాలజీ) వాడకాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టి ముందడుగు వేసింది. 2011లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో సిఎస్‌టిఈ, సిఈఈ కార్యాలయాల మధ్య ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

11/26/2015 - 08:20

గుంటూరు, నవంబర్ 25: జలసంపద, పచ్చదనం, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మమేకం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలోనూ ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు.

11/26/2015 - 08:13

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఇంటర్‌సెప్టర్ వాహనాల ఏర్పాటుతో ప్రమాద మృతులు కూడా తగ్గాయని డిజిపి జెవి రాముడు తెలిపారు. గత వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ఈ వారంలో 634 ప్రమాద కేసులు తగ్గాయన్నారు. ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో 2,847 కేసులు నమోదు కాగా, 16నుంచి 22వ, తేదీ వరకు 2,213 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

11/26/2015 - 08:12

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ టీచర్ల బదిలీల్లో సాంకేతిక అంశాలతో దాదాపు 300 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిలో డిఇఓల నుండే 120 వరకూ క్లయిమ్‌లు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంథ్యారాణి సరిచేశారు.

11/26/2015 - 08:11

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఈ నెల 28న తేదీన హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడనున్నారు. హైదరాబాద్ సచివాలయానికి చంద్రబాబు గత 83 రోజులుగా దూరంగా ఉన్నారు.

11/26/2015 - 07:59

విశాఖపట్నం, నవంబర్ 25: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శే్వతపత్రం అడవుల్లో మంట పుట్టిస్తోంది. శే్వతపత్రాన్ని పరిశీలిస్తే బాక్సైట్ తవ్వకాలకే బాబు మొగ్గుచూపుతున్నట్టు అర్థమవుతోంది. పక్క రాష్ట్రాల్లో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఇక్కడ తవ్వకాలు జరిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నట్టుంది.

Pages