రాష్ట్రీయం

విజయవాడలో 2న విద్యా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యావిభాగాలపై వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో సమీక్ష నిర్వహించనున్నట్టు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని విద్యా శాఖల స్థితిగతులను అధ్యయనం చేస్తారని అన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. దీనికంటే ముందు 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని వైజాగ్‌లో నిర్వహించాలని భావించామని, కాని రెండో తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి సమీక్ష ఉన్నందున, దానిని విజయవాడకు మార్చే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. అంగవైకల్యంతో బాధపడేవారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చేపట్టే ఈ కార్యక్రమానికి గరిమెళ్ల సుబ్రహ్మణ్యం, అరుంధతీనాధ్, కోరుకొండ రంగారావు వంటి వారిని ఆహ్వానించామని చెప్పారు. కాగా ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు, యూనివర్శిటీల ఉమ్మడి బిల్లు రెండూ సిద్ధమయ్యాయని, తుది మెరుగులు దిద్దుతున్నామని, త్వరలోనే క్యాబినెట్ ఆమోదం పొంది వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
కేశవరెడ్డి ఆస్తులు అమ్మకం
కేశవరెడ్డి పాఠశాల ఆస్తులను అమ్మి తల్లిదండ్రులకు చెల్లించేలా సిఫార్సులు చేసేందుకు ఇప్పటికే అగ్రిగోల్డు వ్యవహారాలను అధ్యయనం చేసిన నర్సింహమూర్తి, కుటుంబరావు కమిటీకే బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి వెల్లడించారు.