S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/28/2015 - 05:59

కొత్తపేట/తణుకు, నవంబర్ 27: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం మద్దతు ధరకు కొనుగోలుచేయాలని వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్‌చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొత్తపేట తణుకు మండలాల్లో నష్టపోయిన వరి పొలాలను శుక్రవారం జగన్ పరిశీలించారు.

11/28/2015 - 05:58

విశాఖపట్నం, నవంబర్ 27: పెంచిన వేతనాల జీఓను వెంటనే విడుదల చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉత్తరాంధ్రలో ఉద్రిక్తంగా జరిగింది. కలెక్టరేట్లలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అంగన్‌వాడీలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.

11/28/2015 - 05:58

కర్నూలు, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అతి తక్కువ రోజుల్లో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ఫలాలు రాయలసీమకు అందాలంటే కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై సిద్దేశ్వరం ఆనకట్ట నిర్మించక తప్పదని సాగునీటి రంగం నిపుణులు పేర్కొంటున్నారు. సిద్దేశ్వరం ఆనకట్ట ఆవశ్యకత గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులు, నిపుణులతో మాట్లాడినట్లు సమాచారం.

11/28/2015 - 05:48

నెల్లూరుసిటీ, నవంబర్ 27: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని, రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని ఏసి సెంటర్‌లో ఆనం సోదరులు భవిష్యత్ రాజకీయాలపై తన అనుచరులతో ఆత్మీయ సదస్సును నిర్వహించారు.

11/28/2015 - 05:45

వాకాడు, నవంబర్ 27: నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని పులింజేరి పాలెం, శ్రీనివాసపురం వద్ద బంగాళాఖాతంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన శకలాలు నేవీవిగా అధికారులు గుర్తించారు. చెన్నై నేవీ అధికారులు సముద్రతీరానికి చేరుకొని ఆ శకలాలను గుర్తించి యుద్ధం జరిగే సమయంలో శత్రువులపై ప్రయోగించే టాక్‌విడో అని యుద్ధ సమయంలో ముందస్తుగా ఈ పరికరాన్ని ప్రయోగిస్తారన్నారు.

11/28/2015 - 05:40

సింహాచలం, నవంబర్ 27: ఇతర కులాల తరహాలోనే ఆర్థికంగా వెనుకబడ్డ నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అఖిల భారత బ్రాహ్మిణ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ శ్రీనివాస్ కోరారు. సింహాచలం శ్రీనివాస కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల్లోని అన్ని వర్గాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

11/28/2015 - 05:38

రాజమండ్రి, నవంబర్ 27: రాష్టవ్రిభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్టవ్రిభజనలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, తగిన న్యాయం చేయాలని ఆయన శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖలో కోరారు. రాష్టవ్రిభజన ప్రక్రియ గందరగోళం మధ్య జరిగిందని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎఐసిసి నేత దిగ్విజయ్‌సింగ్ కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారన్నారు.

11/28/2015 - 05:37

మధురవాడ, నవంబరు27: చర్చి పాస్టర్‌కు బలంతంగా శిరోముండనం చేయించిన పాఠశాల డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురవాడ ఎసిపి రవిబాబు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. 4వ వార్డు పరిధలోని కొమ్మాది కూడలి వద్ద నివాసముంటున్న జి డేనియేల్ భీమిలి మండలం తాటితూరులో గత 15ఏళ్లుగా ఫెయిత్ హోం ప్రేయర్ ఫెల్లోషిప్ పేరున ఒక చర్చి నిర్వహిస్తున్నాడు.

11/28/2015 - 05:37

విజయవాడ, నవంబర్ 27: రాష్ట్రంలో ప్రభుత్వ ఇసుక విధానం, బాక్సైట్ తవ్వకాల అంశాలపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేసారు. ఈమేర ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసారు. ఇసుక విధానంపై శే్వతపత్రం విడుదల చేయటంతోపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాల్‌సెంటర్ పెడతామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.

11/28/2015 - 05:36

రాజమండ్రి, నవంబర్ 27: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. ఈ విధానాల వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలో మరోసారి విభజన ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజమండ్రిలో శుక్రవారం జరిగిన రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సదస్సులో రాఘవులు మాట్లాడారు.

Pages