రాష్ట్రీయం

సచివాలయానికి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధిరేటు సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి హైదరాబాద్ సచివాలయంలో శనివారం జరిగే ఉన్నతాధికారుల సమావేశం దిశానిర్దేశం చేయనుంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, లక్ష్య సాధనకు నిధుల అవసరమెంతో లెక్కించడం, వనరుల సమీకరణ తదితర అంశాలపై స్పష్టతకు రావడం స్థూలంగా శనివారం జరగబోయే సమావేశం ఉద్దేశాలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి) వృద్ధిరేటు 15 శాతం సాధించాలన్న లక్ష్యంతో సిఎం ఉన్నారు. దీనికోసం శాఖలవారీ, జిల్లాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి సమావేశం వేదికకానుంది. సమావేశంలోనే శాఖాధిపతులకు నిర్దిష్టమైన టార్గెట్లు ఇవ్వనున్నారు. సిఎం చంద్రబాబు పరిపాలనను విజయవాడకు మార్చిన దరిమిలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న రెండంకెల సమ్మిళిత వృద్ధి లక్ష్యానికి కీలకం కాబోతోంది. 150 ప్రభుత్వ శాఖలు, 33 కార్యదర్శుల కార్యస్థానాలు, 20 మంత్రిత్వశాఖలు, ఇంకా వివిధస్థాయిల్లో స్థానిక పరిపాలన సంస్థల నుంచి ముఖ్యమంత్రి ఎటువంటి ఫలితాలు, ప్రగతిని ఆశిస్తున్నారో సమావేశం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించనుంది. ప్రధానమైన 12 ప్రభుత్వ శాఖలు సమావేశంలో ప్రెజెంటేషన్స్ ఇవ్వనున్నాయి. తరువాత వీటిపై కూలంకుషంగా చర్చించి కార్యాచరణ ప్రణాళికలపై ఒక అవగాహనకు వస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్ కనెక్టివిటీ, నీటి వనరుల సంరక్షణ, ప్రతి ఇంటికి టాయిలెట్ల నిర్మాణం, ఎల్‌ఇడి బల్బుల విస్తృత వాడకం గురించి సిఎం సమావేశంలో లక్ష్యాలను నిర్దేశించనున్నారు. రానున్న 2, 3 ఏళ్లలో అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారి వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం. నాలుగేళ్లలో మొత్తం 28 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రహదారులను నిర్మించాల్సి ఉంది. దీనిపై సమావేశంలో వివరంగా చర్చించనున్నారు. మొత్తం 60 లక్షల టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలన్న లక్ష్యాన్ని వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిపై సమగ్రంగా చర్చిస్తారు. ప్రతి వ్యక్తి కనీసం 8 మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ఎలా సాధించాలన్న అంశంపై కార్యాచరణ నిర్ణయిస్తారు. అలాగే ఇప్పటికే 659 గ్రామాల్లో చేపట్టిన ఘన వ్యర్థాల నిర్వహణను రానున్న 4 ఏళ్లలో మొత్తం 2వేల గ్రామాలకు ఎలా విస్తారించాలన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క శాఖకు లక్ష్యాలను ఏర్పరచి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగం, సామాజిక సాధికారత, మానవ వనరులపై ఈ సమావేశం పూర్తిస్థాయిలో చర్చిస్తుంది. సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఏమున్నాయో చర్చించి వాటికి ఎటువంటి ప్రణాళికలు అవసరమో సమాలోచన చేస్తారు. మొత్తంమీద ఈ మేధోమధనంలో వచ్చే నెలలో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు పూర్వరంగాన్ని సిద్ధం చేస్తారు. ఏయే జిల్లాలో ఎటువంటి పనులు మిగిలి ఉన్నాయో, ఎటువంటి లక్ష్యాలను పూర్తిచేయాల్సి ఉందో నిర్ణయిస్తారు. ఇక్కడ జరిగే ప్రతి చర్చ, సారాంశంపై కార్యాచరణ ప్రణాళికల తయారుచేసి క్షేత్రస్థాయిలో వాటిని సంపూర్ణంగా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన.
2016-17 ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్టమైన ప్రణాళికను కూడా సమావేశంలో నిర్ణయిస్తారు. అదేవిధంగా విజన్ 2029కి సంబంధించిన కసరత్తు తుది దశలోఉంది. దీనిపై సమగ్రంగా చర్చించి ప్రకటించనున్నారు. డిసెంబరు మొదటివారంలో దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులందరితో ఒక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. వర్క్‌షాప్‌పై కూడా సమావేశంలో చర్చిస్తారు. వనరుల సమీకరణ, అంతర్గతంగా, అంతర్జాతీయంగా, ప్రైవేట్ భాగస్వామ్యంతో సేకరించే నిధుల గురించి కీలక చర్చ జరుగుతుంది. స్మార్ట్ ఆంధ్ర కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు, ఎన్‌ఆర్‌విలను ఇంకా పెద్దఎత్తున భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విషయంపైనా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తారు.