రాష్ట్రీయం

మా గ్రామాలు ఉంటాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 27: కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం వరకు నాలుగులేన్ల రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణను ప్రారంభించిన సమయంలో నిద్రలేని రాత్రుళ్లు గడిపిన వివిధ గ్రామాల ప్రజలు..మళ్లీ అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన నాలుగు లేన్ల రోడ్డు సుమారు 16.5 కిలోమీటర్లు కొనసాగుతుండటంతో ఏ గ్రామాల మీదుగా రహదారి పోతుందో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు 200 అడుగుల రోడ్డు వేస్తే తమ గ్రామమే ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కృష్ణమ్మ వారధిపై తలపెట్టిన బ్రిడ్జి వలన వెంకటపాలెం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కృష్ణానదిపైగా వెళ్లిన పక్షంలో తమ గ్రామానికి ఇబ్బంది అని వెంకటపాలెం రైతులు అంటున్నారు. అయితే ప్రభుత్వం తాడేపల్లి మండలం సీతానగరం వద్ద గల కొండను నాలుగు లేన్ల రోడ్డుకు అనువుగా సొరంగాలు తవ్వి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించారని తెలియటంతో ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, వెలగపూడి, మందడం గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలంలోని కృష్ణకెనాల్ జంక్షన్ సమీపం నుంచి నాలుగులైన్ల రహదారి నిర్మితమవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సిఆర్‌డిఎ సిఇ కాశీవిశే్వశ్వరరావు మాట్లాడుతూ రెండు నెలల్లో రహదారులపై స్పష్టత వస్తుందన్నారు.