రాష్ట్రీయం

పరస్పర ఆరోపణలు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రలో తమ సేవలను అందించడం లేదన్న అంశంపై విచారణ జరిగిన సందర్భంలో ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లు పరస్పర ఆరోపణలు చేసుకోవడంపట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 4న తాము ఇచ్చిన ఆదేశాలపై ఇరు రాష్ట్రాలు తీసుకున్న చర్యలు ఏమిటని హైకోర్టు నిలదీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని స్టడీ సెంటర్లలో పనిచేసే సిబ్బంది వేతనాలకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే నవంబర్ 23వ తేదీననే రూ. 33 కోట్లు విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు అడ్వకేట్ జనరల్‌లు పరస్పర ఆరోపణలకు దిగడం సబబు కాదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి చూపించాల్సిందిగా సూచించింది.