రాష్ట్రీయం

హార్డ్‌వేర్‌కు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 27: రాష్ట్రంలో హార్డ్‌వేర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, తిరుపతి-చెన్నయ్-నెల్లూరుల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధిపథంలో నడిపిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటి హబ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర మొబైల్‌హబ్ తొలి యూనిట్‌ను సిఎం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తాను హైదరాబాదులో హైటెక్ సిటీని ఏర్పాటు చేసి సాంకేతిక రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించానన్నారు. నేడు నవ్యాంధ్రప్రదేశ్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలను అభివృద్ధి పరచడానికి అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు. హార్డ్‌వేర్ రంగానికి ఒక టాస్క్ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసి ఈపరిజ్ఞానాన్ని అన్ని విధాలా రాష్ట్రానికి సద్వినియోగం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మనకు అవసరమైన పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 2022 నాటికి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో తిరుగులేని అభివృద్ధిని తీసుకువచ్చి అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తామన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. కృష్ణపట్నంలో త్వరలోనే జపాన్ సంస్థ పెట్టుబడులు పెట్టనుందన్నారు. ఈ క్రమంలో నెల్లూరులో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. దీంతో తిరుపతి నుంచి నెల్లూరు వరకు ఒక అద్భుతమైన పట్టణాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి పరిశ్రమల పెట్టుబడికి అనుకూలమైన ప్రదేశమన్నారు. అందుకు ప్రధాన కారణం రైల్వేస్టేషన్, విమానాశ్రయం, జాతీయ రహదారులు పరిశ్రమలకు ఎంతో అనువైన ప్రదేశమన్నారు. తిరుపతి- చెన్నయ్-నెల్లూరు మధ్య ట్రైసిటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటవడానికి కూడా మార్గం సుగమం అవుతుందన్నారు. ఈపరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో తిరుపతి పరిసరాల్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రస్తుతం సెల్‌కాన్ సంస్థలతోపాటు మరో పది సంస్థలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు.

సెల్‌కాన్ కంపెనీ మొదటి యూనిట్ నిర్మాణానికి
భూమి పూజ చేసి ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు