S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/14/2016 - 06:10

రాష్టవ్య్రాప్తంగా సంక్రాంతి సంబరాలు అధికారికంగా అట్టహాసంగా ఆరంభమయ్యాయ. అనంతపురంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ప్రారంభించి పిండి వంటలు వండుతున్న పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత

01/14/2016 - 06:07

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఏ కార్యాలయాన్ని ఎక్కడ నిర్మించాలనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. రానున్న రోజుల్లో శాశ్వత సచివాలయాన్ని ఉద్ధండరాయుని పాలెంలో నిర్మించాలని నిర్ణయించారు.

01/13/2016 - 18:16

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేరున లేఖ విడుదల చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

01/13/2016 - 18:13

కర్నూలు: జిల్లాలోని డోన్‌ మండలం కొత్తపల్లెలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో గొడవపడిన దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో భర్త లేని సమయంలో భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. మనస్తాపానికి గురై రైలు కిందపడి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

01/13/2016 - 16:39

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లతో రేపు టెండర్లు ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయం వెలగపూడిలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండస్తుల్లో సచివాలయం నిర్మించనున్నట్లు తెలిపారు.

01/13/2016 - 13:42

విశాఖ: విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భవానీ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌ 22న భవానీ అనే యువతి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె బంధువులు కోర్టును ఆశ్రయించారు.

01/13/2016 - 13:40

హైదరాబాద్ : తెలంగాణాలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ వారేనని రేవంత్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రజలను వంచించే మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో టీడబ్ల్యూజేెఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

01/13/2016 - 13:33

హైదరాబాద్ : సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ తదితరులు హాజరయ్యారు. వంద గజాల ఆక్రమణల క్రమబద్ధీకరణ, గతంలో జరిగిన భూకేటాయింపుల జీఓలపై చర్చ జరిగింది.

01/13/2016 - 13:30

హైదరాబాద్ : ఏపీలో 600 మంది వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు నెలలకు పైగా విధులకు గైర్హాజరవుతున్న దాదాపు 600 మందికి పైగా వైద్యులను గుర్తించి షోకాజ్ నోటీసుల జారీ చేసింది. వీరంతా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్నారు. వైద్యుల గైర్హాజరు వల్ల దాదాపు రూ.150 కోట్ల విలువైన వైద్య పరికరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి.

01/13/2016 - 13:29

హైదరాబాద్ : తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వలే కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని ఏపీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, భాజపా నేత రఘు రామకృష్ణరాజు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉపేంద్రమిశ్రాకు లేఖ రాశారు. తమిళనాడు జల్లికట్టును సంప్రదాయ క్రీడగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం విదితమే.

Pages