S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/15/2016 - 06:17

హైదరాబాద్, జనవరి 14: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ వాహన యాజమానులకు ఉపశమనం కలిగించే విధంగా రెండు రాష్ట్రప్రభుత్వాలు త్వరలో ఎంట్రీ ట్యాక్స్‌ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనున్నాయి. ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖ కమిషనర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

01/15/2016 - 06:16

తిరుమల, జనవరి 14: మూడు వందల రూపాయలు చెల్లించి, ప్రత్యేక దర్శనంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త! ఇందుకోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తుడికి శుక్రవారం నుండి సంక్రాంతి కానుకగా అదనంగా రెండు లడ్డూలను విక్రయించాలని ఈవో సాంబశివరావు నిర్ణయించారు. ప్రస్తుతం ఆరుగురు కుటుంబ సభ్యులు కలిగిన భక్తులు 300 రూపాయల టిక్కెట్లు కొంటే వారికి ఉచితంగా 12 లడ్డూలను టిటిడి అందిస్తోంది.

01/15/2016 - 06:15

హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు మార్గంతో అనుసంధానం చేసే ప్రతిపాదనను రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారు. ఈ మేరకు అవసరమైన నివేదిక తయారు చేసి కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పంపింది. సర్వే పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని రైల్వే బోర్డు సమాచారం పంపినట్లు తెలిసింది.

01/14/2016 - 13:05

హైదరాబాద్‌: సంక్రాంతి సంబురాలను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో అగాఖాన్‌ అకాడమీ ప్రాంగణంలో రెండు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగను తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌ ప్రారంభించారు.

01/14/2016 - 13:04

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జాతీయ రహదారి పక్కన భాగ్యనగర్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. గ్యాస్‌ లీకవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తున్నారు.

01/14/2016 - 13:04

హైదరాబాద్ : సంక్రాంతి సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ సంబురాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రైట్ టు ఓట్ ఛాంపియన్‌ను ప్రారంభించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు పతంగుల పండుగలో పాల్గొన్నారు.

01/14/2016 - 12:48

హైదరాబాద్‌: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శి అబ్దుల్‌ రహీమ్‌ ఖురేషి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు రహీం ఖురేషి మృతిపట్ల సంతాపం తెలిపారు.

01/14/2016 - 12:42

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు.తెలంగాణలో టీ.టీడీపీ నేతలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మీయ కలయిక పేరిట నియోజకవర్గంలో తలపెట్టిన కార్యక్రమానికి నాందిగా ఎన్టీఆర్ భవన్‌లో మోత్కుపల్లి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

01/14/2016 - 12:35

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మురుమళ్ల గ్రామంలో ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు కోడిపందేలను ప్రారంభించారు.

01/14/2016 - 08:31

హైదరాబాద్, జనవరి 13: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ), యుకెకి చెందిన హెన్లీ బిజెనెస్ స్కూల్ సంయుక్తంగా స్వల్పకాలిక ఎంబిఏ ప్రోగ్రామ్ కోర్సును ప్రారంభించేందుకు అంగీకారానికి వచ్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఇందుకు సంబంధించి త్వరలో అవగాహన ఒప్పందం (ఒంఓయు) చేసుకోనున్నట్లు తెలిపింది.

Pages