S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/14/2016 - 08:30

హైదరాబాద్, జనవరి 13: తెలిసీ తెలియని వయసులో తల్లికి దూరమైన ఇద్దరు పిల్లలు పెద్దయ్యారు. తల్లి ప్రేమను కావాలనుకున్న ఆ యవతులు సౌదీ నుంచి పాతబస్తీకి చేరుకున్నారు. తల్లి ప్రేమకు దూరమైన ఆ ఇద్దరు యువతులకు పోలీసులు అండగా నిలిచి వెతకడం ప్రారంభించారు. సినిమా కథను తలపించే వీరి యదార్థగాథ వివరాల్లోకి వెళితే..

01/14/2016 - 08:29

విజయవాడ (క్రైం), జనవరి 13: కల్తీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈమేరకు విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక స్వర్ణ బార్‌లో మద్యం సేవించి గత ఏడాది డిసెంబర్ 7న ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

01/14/2016 - 08:29

కాకినాడ, జనవరి 13: ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఎస్ అచ్యుతాపురం గ్రామంలో నివసిస్తున్న డాక్టర్ అద్దేపల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కాకినాడ స్థిరపడిన అద్దేపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా బందరు.

01/14/2016 - 08:25

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజి విద్యుత్ పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నారు. సామర్థ్యంలేని పంపుసెట్లను మార్చి వాటి స్థానంలో నాణ్యమైనవి అమర్చి, విద్యుత్‌ను ఆదాచేయడం ఈ పథకం లక్ష్యం. ఇది నిజంగా రైతులకు శుభవార్తే. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ మంజూరు చేసిన రూ.294.75 కోట్లతో మొదట దీనిని ప్రారంభిస్తారు.

01/14/2016 - 08:07

కడియం, జనవరి 13: తెలుగింట సంక్రాంతి సందడి తెలిపేలా వివిధ రకాల మొక్కలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులతో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో విరివనం మురిసింది. గంగిరెద్దులు, భోగిమంటలు సంస్కృతిని చాటే ఆకృతులను రూపుదిద్దుతూ వేలాది మొక్కలతో తీర్చిదిద్దిన ఆకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

01/14/2016 - 08:04

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం ఆది దంపతులకు భృంగివాహన సేవ నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు చేపట్టారు. ఆగమశాస్త్రానుసారం రుద్రహోమం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

01/14/2016 - 08:01

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పర్వదినాన మూడు రోజుల పాటు తమ తమ స్వస్థలాల్లో గడపటానికి హైదరాబాద్, అలాగే చెన్నై, బెంగళూరు, ఇతర నగరాల నుంచి తరలివస్తున్న వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతోంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులుగా ముందు నుంచే దాదాపు 750 ప్రత్యేక బస్సులను ఆయా ప్రాంతాలకు పంపించడం జరిగింది.

01/14/2016 - 08:01

మార్కాపురం, జనవరి 13: ఉద్యోగం వస్తుందనే పేరాశతో భర్తను భార్య హత్య చేయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ హత్యకేసు విచారణ జరుపుతున్న సమయంలో ఈ హత్య కేసు బయటపడినట్లు ప్రకాశంజిల్లా మార్కాపురం డివైఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2009 ఆగస్టు 9న ఈసంఘటన జరిగినట్లు తెలిపారు.

01/14/2016 - 08:00

ఏర్పేడు, జనవరి 13 : చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ప్రాంతంలో లారీలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎర్రకూలీలు బుధవారం నాడు తెల్లవారి జామున చెలరేగిపోయారు. తమను వెంటాడుతున్న టాస్క్ఫోర్స్ బృందంపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఎస్సై వాసు గాయపడ్డాడు. ఎర్రచందనం దుంగలతో పారిపోవడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపి ఒక మెకానిక్ షాపును ఢీకొన్నాడు.

01/14/2016 - 07:59

కడప, జనవరి 13: కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు 6వ యూనిట్ పనులు అధికారులు ప్రకటించినట్లు ఈ ఏడాది కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. రూ.3,500 కోట్ల ఖర్చుతో నిర్మించతలపెట్టిన 6వ యూనిట్ పనులు 2010లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టునాటికే పూర్తిసామర్థ్యంతో ఉత్పత్తి సాధించాలని జన్‌కో అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Pages