S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/13/2016 - 08:31

విజయవాడ, జనవరి 12: రాష్ట్రంలో భూ సేకరణ పేరిట పేదల నుంచి ఎంతో విలువైన వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించే ప్రయత్నాన్ని నిరసిస్తూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 9న చలో అసెంబ్లీ నిర్వహించాలని మంగళవారం నాడిక్కడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల పోరాట కమిటీ విస్తృత స్థాయి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

01/13/2016 - 08:28

హైదరాబాద్, జనవరి 12: టిడిపి-బిజెపి సంయుక్తంగా నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం’ విజయవంతమైంది. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావడంతో రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. సభ నిర్వహించిన నిజాం కళాశాల మైదానం రెండు పార్టీల కార్యకర్తలతో నిండిపోయింది.

01/13/2016 - 08:20

విశాఖపట్నం, జనవరి 12: మంచి ఆలోచనలతో యువత ముందుకు వస్తే వారికి అవసరమైన చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

01/13/2016 - 08:18

రాజమహేంద్రవరం, జనవరి 12: సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్రంలో తొలిసారి దేవాదాయశాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

01/13/2016 - 08:10

హైదరాబాద్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల భాగస్వామ్య సదస్సులో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదరడంపై ఒకవైపు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా మరోవైపు ఈ ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సులో ఐదు లక్షల కోట్ల వరకూ మాత్రమే పెట్టుబడులకు హామీలను పొందగలిగింది.

01/13/2016 - 07:24

ఏలూరు, జనవరి 12: ‘‘ప్రభుత్వం మనది... యథేచ్ఛగా కోడిపందాలు ఆడుకోండి... ఎస్సైగాని, ఆపై అధికారి గాని, అంతకు పై అధికారిగాని వస్తే చెట్టుకు కట్టేయండి.. నేను చూసుకుంటా’’.. ఇది పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఒక ఢిల్లీ స్థాయి ప్రజాప్రతినిధి ఇచ్చిన భరోసా.

01/13/2016 - 06:09

తిరుమల, జనవరి 12: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి సుప్రభాత సేవ నుండి సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ వరకు తితిదే భక్తులకు విక్రయిస్తున్న ఆర్జిత సేవా టిక్కెట్లు ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని ఈవో డి సాంబశివరావు నిర్ణయించారు. ఫిబ్రవరిలో అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టిక్కెట్లను నెలముందే ఆన్‌లైన్‌లో ఉంచి ముందుగా ప్రకటిస్తుంది.

01/13/2016 - 06:07

విశాఖపట్నం, జనవరి 12: సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది. లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంగా సాగిన ఈ సదస్సులో ప్రభుత్వం ఆశించిన దానికన్నా ఎక్కువ పెట్టుబడులే వచ్చాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించారు. అయితే అంచనాలకు మించి నాలుగు లక్షల 67 వేల 577 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

01/13/2016 - 06:03

విశాఖపట్నం, జనవరి 12: ‘ఆంధ్ర ప్రదేశ్ లక్కీ స్టేట్. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారంతా లాభాలు ఆర్జిస్తున్నారు. మీరూ పెట్టుబడులు పెట్టండి. కావల్సిన సహకారాన్ని అందిస్తాను’ అని దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు సిఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. విశాఖలో మూడు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన భాగస్వామ్య సదస్సు మంగళవారం ముగిసింది.

01/13/2016 - 06:01

అచ్యుతాపురం, జనవరి 12: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్ (ప్రత్యేక ఆర్థికమండలి)లో చైనాకు చెందిన ట్రైనాసోలార్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమకు మంగళవారం భూమిపూజ జరిగింది. ఎపిఐఐసి చైర్మన్ ఆర్ క్రిష్టయ్య చేతుల మీదగా కార్యక్రమం నిర్వహించారు.

Pages