S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/11/2016 - 07:56

హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ఉద్యమ కాలంలో రాజధాని నగరంలో వీధులన్నీ జై తెలంగాణ నినాదాలతో మారుమోగగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్ర ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎత్తులకు పై ఎత్తులతో తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

01/11/2016 - 07:55

హైదరాబాద్, జనవరి 10: ‘తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామన్న హామీ కూడా జోక్‌గానే చెప్పారా?’ అని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావును ప్రశ్నించారు.

01/11/2016 - 07:54

హైదరాబాద్, జనవరి 10: సంక్రాం తి రద్దీ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణాలు మొదలు పెట్టారు. అన్ని రైళ్లలో రిజర్వేన్లు ఫుల్. ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు, అదనపు సీట్లు కూడా అన్నీ ఫుల్. కృష్ణా, సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్‌సిటీ, శాతవాహన, జన్మభూమి, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు వంటి పగలు నడిచే సెకండ్ సీటింగ్ రైళ్లలోనూ ఒక్క సీటు కూడా దొరకని పరిస్థితి.

01/11/2016 - 06:41

14 శాతమైనా మీరు సాధించగలరు
కేంద్రాన్ని మించిపోయే పరుగు భేష్
సమస్యలు ఎదుర్కోగలిగే సత్తా మీది
పారిశ్రామిక ప్రగతిలో మహిళలకు చోటు
త్వరలో కేంద్ర పథకం ‘స్టాండప్ ఇండియా’
భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి జైట్లీ

01/11/2016 - 06:38

విశాఖపట్నం, జనవరి 10: విశాఖ జిల్లా రాంబిల్లివద్ద ఐదు వేల కోట్లతో అణు జలాంతర్గామి నిర్మాణ ప్రాజెక్ట్ (న్యూ వరల్డ్‌క్లాస్ నేవీ ఫెసిలిటీ ప్రాజెక్ట్)ను స్థాపించనున్నట్టు రిలయన్స్ ఎడిఎ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో మూడు రోజులపాటు జరిగే భాగస్వామ్య సదస్సు ఆదివారం ప్రారంభమైంది. అనిల్ అంబానీ పెట్టుబడి ప్రకటనతో సదస్సు ప్రారంభం కావడం గమనార్హం.

01/11/2016 - 06:37

విజయవాడ, జనవరి 10: గ్రామ స్వరాజ్యంపై మహాత్మాగాంధీ కలలను సాకారం చేస్తున్న ఘనత దేశంలో ఒక్క ఎన్డీయేకే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దశాబ్దకాలం క్రితం అటల్‌బిహారీ వాజ్‌పాయ్ నాయకత్వంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద గ్రామాలను అనుసంధానించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి ప్రధాని నరేంద్రమోదీ గ్రామాల్లో వెలుగునింపే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

01/11/2016 - 08:05

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. తొలిరోజే సిఐఐ సదస్సు సూపర్ హిట్టయ్యింది. రాష్ట్భ్రావృద్ధికి లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలన్న ఆంధ్ర సంకల్పానికి బలమైన బీజమే పడింది. తొలిరోజే 1.95లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలకు లాభాలు పంట పండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

01/11/2016 - 07:50

సూళ్లూరుపేట, జనవరి 9: అంతర్జాతీయ స్థాయిలో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు గుర్తింపు తెచ్చి పులికాట్, నేలపట్టు ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన సూళ్లూరుపేటలో జరిగే పక్షుల పండుగను రోడ్డు భవనాల శాఖమంత్రి శిద్దా రాఘవరావుతో కలసి ఘనంగా ప్రారంభించారు. వారు స్థానికులతో కలసి వచ్చి పక్షుల పండుగను రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు.

01/10/2016 - 20:53

కడప, జనవరి 9:ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు ఉన్నత చదువులు, ఇతరత్రా కారణాలతో సెలవు పెట్టి ఆసుపత్రులు మూతపడే పరిస్థితులు తీసుకొస్తున్నారని, ఇలాంటి వైద్యులను శాశ్వతంగా ఇంటికి పంపి వారి స్థానంలో కొత్త వైద్యులను నియామకం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి సీమ జిల్లాలకు నీరు అందిస్తామన్నారు.

01/10/2016 - 05:32

సూళ్లూరుపేట, జనవరి 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన 1425కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

Pages