S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/11/2016 - 13:42

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లిలో దాదాపు 29 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో దాదాపు 42.5 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారు.

01/11/2016 - 13:32

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ నిధులను కేసీఆర్‌ ఆర్టీసీకి మళ్లించారని, సెటిలర్లపై కేసీఆర్‌ కపట ప్రేమ చూపుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో మంగళవారం జరగబోయే టీడీపీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ, బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ కూడా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

01/11/2016 - 13:26

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు... కానీ ప్రజల జీవితాలు మెరుగుపడలేదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బాలానగర్‌లో పలువురు నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తే ఏమీ చేయని సీఎం ఇప్పుడు మేయర్‌ పదవి ఇస్తే ఏం చేస్తారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.

01/11/2016 - 13:08

హైదరాబాద్: హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని రాష్ర్టమంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

01/11/2016 - 12:35

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఈనెల 18న లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ ఈనెల 18న నిర్వహించనున్న మెగా రక్తదానంలో ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొనాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

01/11/2016 - 08:08

విజయవాడ, జనవరి 10: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి వేడుకల నిర్వహణకు గత ఏడాదిలానే ఈ పర్యాయం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

01/11/2016 - 08:07

విజయవాడ, జనవరి 10: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఆదివారం ఉదయం వివిధ కేటగిరీల్లో జరిగిన అమరావతి మారథాన్ ‘పరుగు’ ఆబాల గోపాలంలో అత్యుత్సాహాన్ని నింపింది. వయస్సుతో నిమిత్తం లేకుండా పరుగులో పాల్గొనటానికి వేల సంఖ్యలో తరలిరాగా, వీరిని చూసేందుకు కొన్నివేల మంది రోడ్లపై ఉదయం నుంచే బారులు తీరారు.

01/11/2016 - 08:06

విశాఖపట్నం, జనవరి 10: విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు తొలిరోజు ఆదివారం వివిధ కంపెనీల మధ్య, ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మొత్తం మీద 1,95,457 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే విద్యుత్ రంగంలో 67,055 ఉద్యోగాలు, పారిశ్రామిక రంగంలో 27,393 మందికి, మైనింగ్ రంగంలో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

01/11/2016 - 07:57

హైదరాబాద్, జనవరి 10: అమరావతి రాజధాని నిర్మాణానికి అనుసరించి భూసమీకరణ సత్ఫలితాలు ఇవ్వడంతో, ఇక రాష్టమ్రంతా వౌలిక సదుపాయాలు, కర్మాగారాలు, సంస్థ లు నెలకొల్పేందుకు ఇదే మార్గాన్ని అమలు చేయాలని ఎపి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, శివార్లలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కాని అవసరమైన భూమిని సేకరించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి.

01/11/2016 - 07:56

హైదరాబాద్, జనవరి 10: విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేసింది. ఆదివారం టి పిసిసి అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్, ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్ ఈ న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు అర్ధాంతరంగా వెనక్కిరావడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు.

Pages