S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/13/2016 - 05:58

హైదరాబాద్, జనవరి 12: ‘నేను ఎక్కడికీ పోలేదు.. మీ వెంటే ఉన్నాను.. మీ తోనే ఉంటాను..’ అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మంగళవారం టిడిపి- బిజెపి సంయుక్తంగా నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు.

01/13/2016 - 05:59

విశాఖపట్నం, జనవరి 12: రాష్ట్రంపై కేంద్రం కరుణ చూపి వరాల వర్షం కురిపించింది. విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు మంగళవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

01/12/2016 - 16:33

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్‌పై నటుడు పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియోషన్‌కు ఫిర్యాదు చేశారు. అత్తారింటికి దారేది రెమ్యూనరేషన్ కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని నాన్నకు ప్రేమతో విడుదల సందర్భంగా చెల్లిస్తానని నిర్మాత చెప్పారని ఆ ఫిర్యాదులో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

01/12/2016 - 16:31

హైదరాబాద్ : అమెరికా నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించటానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు మధ్యలోనే నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.

01/12/2016 - 16:30

హైదరాబాద్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

01/12/2016 - 06:03

విశాఖపట్నం, జనవరి 11: భాగస్వామ్య సదస్సులో యంత్రాగాన్ని కలవరపెట్టేలా సోమవారం భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు కీలక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధులు హాజరైన సదస్సుకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసిన్నట్టు పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు.

01/12/2016 - 05:59

విశాఖపట్నం, జనవరి 11: రాష్ట్రంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు రెండో రోజు సోమవారం జరిగిన ప్లీనరీ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం రెండంకెల అభివృద్ధి రేటు దిశగా పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కాలంలో 14నుంచి 1 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్నారు.

01/12/2016 - 05:44

విశాఖపట్నం, జనవరి 11: విశాఖపట్నం- చెన్నై కారిడార్ అభివృద్ధికి 840 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సాకో వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆమె మాట్లాడుతూ ఇందులో ఎడిబి 625 మిలియన్ డాలర్లు రుణంగా ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 215 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు.

01/12/2016 - 05:41

విశాఖపట్నం, జనవరి 11: ‘సిఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. నా సమర్థత, రాష్ట్రంలోవున్న అవకాశాలు చూసి అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జన్మభూమిపై వారికున్న అభిమానాన్ని పెట్టుబడుల రూపంలో చాటుతున్నారు’ అని సిఎం చంద్రబాబు అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండోరోజైన సోమవారం 245 ఎంఓయులు జరిగాయి.

01/11/2016 - 18:56

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు పార్టీల నేతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చు నియంత్రణపై పార్టీల నేతలతో చర్చించారు. ఎన్నికల ఖర్చు నియంత్రణపై నిఘాకు 30మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అన్ని పార్టీల హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగిస్తామని చెప్పారు.

Pages