రాష్ట్రీయం

‘జోష్’ పెంచిన శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: టిడిపి-బిజెపి సంయుక్తంగా నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం’ విజయవంతమైంది. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావడంతో రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. సభ నిర్వహించిన నిజాం కళాశాల మైదానం రెండు పార్టీల కార్యకర్తలతో నిండిపోయింది. మైదానంలో ఎంతమంది ఉన్నారో, సభ లోపలికి వెళ్ళలేక బయట రోడ్లపై కూడా అంత మంది కనిపించారు. చుట్టుపక్కల రోడ్లు కూడా కిటకిటలాడాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, ఆబిడ్స్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్ దక్కని సంగతి తెలిసిందే. టిడిపి ఎమ్మెల్యేల ఫిరాయింపు, టిఆర్‌ఎస్ హవా కొనసాగుతున్న ఈ దశలో శంఖారావం బహిరంగ సభ ఎలా జరుగుతుందోనని భయపడిన నేతలు సభకు హాజరైన వారిని చూసి సంతోషించారు. సభకు అధ్యక్షత వహించిన టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ‘చిచ్చరపిడుగు రేవంత్ రెడ్డి’ని ప్రసంగించాలని ఆహ్వానించడంతో సభికులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు.
రేవంత్ ప్రసంగం ఆద్యంతమూ ఆసక్తిగా, కార్యకర్తలను ఉత్తేజపరిచేలా కొనసాగింది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టకుండా, ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పథకాల గురించి వల్లె వేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రసంగం చప్పగా సాగింది. కాగా టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తన ప్రసంగంతో కార్యకర్తలను ఉర్రూతలూగించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేస్తే చాలు వెయ్యి మందిని పంపిస్తానని, ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని కోరారు.
నిజాం కళాశాల వేదికపై ఏర్పాటు చేసిన అతిపెద్ద బ్యానర్‌పై ఒకవైపు ప్రధాని మోదీ, మరోవైపు చంద్రబాబు ఫొటోలు పెట్టారు. వేదికపై స్వామి వివేకానంద, ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టారు. ఇలాఉండగా బిజెపి తిరుగుబాటు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా పాల్గొన్నారు.