S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/20/2016 - 07:08

బళ్ళారి, జూలై 19: కర్నాటక, ఆంధ్రలోని కాల్వలకు తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం సాగు, తాగునీరు విడుదల చేయనున్నారు. ఎడమ, కుడికాల్వలు, పవర్‌కెనాల్‌తో పాటు హెచ్చెల్సీ, ఎల్లెల్సీకి సైతం నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. కాల్వలకు ఒకేసారి అటు కర్నాటక ఇటు ఆంధ్ర కోటా విడుదల చేస్తే నీటి వృథా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

07/20/2016 - 07:08

న్యూఢిల్లీ, జూలై 19: ఒకే వ్యక్తికి రెండు యావజ్జీవ ఖైదును విధించినప్పటికీ వాటిని ఏకకాలంలో అమలు చేయాలే తప్ప ఒకదాని తర్వాత ఒకటిగా కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఒకదాని తర్వాత ఒకటిగా యావజ్జీవ శిక్షల్ని అమలు చేయడం నిర్హేతుకమని, మనిషికి ఒకే జన్మ అన్న వౌలిక భావనకు ఇది విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

07/20/2016 - 05:46

న్యూఢిల్లీ, జూలై 19: జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై ఆర్‌ఎస్‌ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ‘మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పండి.. లేదంటే విచారణను ఎదుర్కోండి’ అంటూ అల్టిమేటం జారీ చేసింది.

07/20/2016 - 05:43

న్యూఢిల్లీ, జూలై 19: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుడిచిపెట్టాలని, నిస్సహన వైఖరితో తరిమికొట్టాలని భారత లోక్‌సభ మంగళవారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఎవరికి వారుగా కాకుండా ఉమ్మడి వ్యూహంతో సంఘటితంగామే ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఘన నివాళులర్పించింది.

07/20/2016 - 05:40

న్యూఢిల్లీ, జూలై 19: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభలో గెలిపించుకోవటం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోంది. బిల్లును పాస్ చేయించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ తమ ఎంపిలకు విప్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు విపక్షాల మద్దతు సంపాదించేందుకూ ప్రయత్నాలు ప్రారంభించింది.

07/20/2016 - 05:23

న్యూఢిల్లీ, జూలై 19: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరరావు ప్రతిపదించిన ప్రయవేట్ బిల్లుకు అంశాలవారీగా తెరాస మద్దతిస్తుందని ఐటి మంత్రి తారక రామారావు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో తనను కలిసిన విలేఖర్లతోతో మాట్లాడుతూ హైకోర్టు విభజనకు అనుకూలంగా ఉన్న అంశాలకు సంబంధించి బిల్లు ఎవరు ప్రతిపదించినా మద్దతిస్తామన్నారు.

07/19/2016 - 18:12

దిల్లీ: అవినీతి ఆరోపణలతో అరెస్టయిన కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ బీకే బన్సల్‌ భార్య, కుమార్తె దిల్లీలోని మయూర్‌ విహార్‌లో తమ ఇంట్లో మంగళవారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. బన్సల్‌ను అవినీతి ఆరోపణలతో జులై 16న సీబీఐ అరెస్ట్‌ చేసింది. బన్సల్‌ ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నారు.

07/19/2016 - 18:08

దిల్లీ: బిజెపి దిల్లీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ క్రికెటర్, ఎంపి కీర్తి అజాద్ భార్య పూనమ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్యసభకు, బిజెపికి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో కీర్తి అజాద్ భార్య కూడా బిజెపికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

07/19/2016 - 18:04

చండీగఢ్: తన భర్త బిజెపికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం బిజెపిలోనే ఉంటానని ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్ మంగళవారం స్పష్టం చేశారు. తన భర్త నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ బిజెపికి రాజీనామా చేసినంత మాత్రాన తాను కూడా పార్టీ మారతానని అనుకోవడంలో అర్థం లేదని ఆమె వివరించారు.

07/19/2016 - 17:14

ఢిల్లీ: గత మూడేళ్ళలో మతపరమైన విద్వేష కేసులు పెరిగినట్లు, విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం జరిగిందన్నారు.

Pages