జాతీయ వార్తలు

హోదా బిల్లుపై హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభలో గెలిపించుకోవటం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోంది. బిల్లును పాస్ చేయించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ తమ ఎంపిలకు విప్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు విపక్షాల మద్దతు సంపాదించేందుకూ ప్రయత్నాలు ప్రారంభించింది. వామపక్షాలతోపాటు జెడియు, టిఎంసి, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సిపిలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. తెలుగుదేశం మద్దతు సంపాదించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరితో చర్చలు జరిపారు. కెవిపి బిల్లుకు మద్దతు ఇవ్వాలనే భావిస్తున్న తెలుగుదేశం, తమ నిర్ణయాన్ని బాహాటంగా ప్రకటించేందుకు సిద్ధపడటం లేదు. కెవిపిప్రతిపాదించిన బిల్లు రాజ్యసభలో విజయం సాధించే పరిస్థితులు ఉంటేనే మద్దతు ప్రకటించాలన్నది టిడిపి ఆలోచన. సుజనా చౌదరి ఇదే విషయాన్ని జయరాం రమేష్‌కు స్పష్టం చేశారు. తమ పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్‌కు తెలియజేయవలసి అవసరం లేదని ఆయన జయరాం రమేష్‌తో చెప్పారు. తెలుగుదేశం నిర్ణయం ఏమిటి? దానిని ఎలా అమలు చేయాలనేది తాము చూసుకుంటామని సుజనా చౌదరి చెప్పారు.
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కెవిపి ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ పూర్తయిన సంగతి, ఓటింగ్ దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. రాజ్యసభ గత సమావేశాల చివరి రోజు ఓటింగ్ జరిగే సమయంలో టిడిపి సభ్యుడు సిఎం రమేష్ లేచి సభలో కోరం లేదంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో సభ వాయిదా పడింది. అందుకే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మొదటి శుక్రవారంనాడు కెవిపి బిల్లుపై ఓటింగ్ జరపవలసి ఉన్నది. ఈ మేరకు బిల్లును ఎజెండాలో కూడా చేర్చారు. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు బిల్లును సభలో చేపట్టి ఓటింగ్‌ను పూర్తి చేయవలసి ఉన్నది. మామూలుగా అయితే ప్రైవేట్ మెంబరు బిల్లును చర్చ తరువాత ఉపసంహరించుకోవటం ఆనవాయితీ. సభ్యుడు ఓటింగ్‌కు పట్టుపట్టే పరిస్థితిలో అది ఓడిపోతుంది. గత అరవై సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే ప్రైవేట్ మెంబర్ బిల్లులపై ఓటింగ్ జరిగి విజయం సాధించాయి. మిగతా సందర్భాల్లో ప్రైవేట్ మెంబరు బిల్లుల్ని చివర్లో ఉపసంహరించుకున్న దాఖలాలే ఎక్కువ. తాజాగా కెవిపి బిల్లుపై ఓటింగ్ జరగవలసి ఉన్నది. ఈ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వటం లేదా తమదిగా చేపట్టటం జరగదనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి అధినాయకత్వం ఏం చేస్తుందనేది వేచి చూడవలసిందే. కెవిపి బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపినా లోక్‌సభలో ఓడిస్తాం కాబట్టి దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని బిజెపి సభ్యులు వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం విప్ జారీ చేసే పక్షంలో తాను బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తానని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ స్పష్టం చేశారు.