S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/20/2016 - 17:09

దిల్లీ: 15ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, దిల్లీ-ఎన్‌సీఆర్‌ బయట కూడా తిరిగేందుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్‌వోసీ) ఇవ్వవద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తెలిపింది. 15ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాటికి మాత్రమే పరిమిత ప్రాంతాల్లో తిరిగేందుకు ఎన్‌వోసీలు ఇవ్వాలని తెలిపింది.

07/20/2016 - 16:20

ముంబయి: బుధవారం సెన్సెక్స్‌ 128 పాయింట్లు లాభపడి 27,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,565 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.18 వద్ద కొనసాగుతోంది.

07/20/2016 - 16:06

దిల్లీ: రాజ్యసభలో బుధవారం మాయావతిపై భాజపా ఎంపీ దయాశంకర్‌సింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.

07/20/2016 - 15:55

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు ఆమోదం తెలపాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్‌ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. కేవీపీ ప్రైవేటు బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముంది.

07/20/2016 - 15:51

దిల్లీ: బుధవారం రూ. 100 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650గా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. రూ. 110 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 46,220గా ఉంది.

07/20/2016 - 15:49

దిల్లీ: భారత హాకీ క్రీడాకారుల్లో దిగ్గజంగా పేరొందిన మహ్మద్ షాహిద్ (56) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత నెల 29న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆయనను బెనారస్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత గుర్గావ్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వైద్యఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు విడుదల చేసింది.

07/20/2016 - 14:35

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది.

07/20/2016 - 12:46

దిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఎపికి ఇచ్చిన హామీలను మరచిపోవద్దని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించేలా మద్దతు పలకాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో ఎపి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

07/20/2016 - 12:43

దిల్లీ: పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే గుజరాత్‌లో దళితులను అవమానించిన ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవెనెత్తి నిరసన తెలిపారు. గుజరాత్ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని ఆప్ ఎంపీలు పట్టుబట్టారు.

07/20/2016 - 07:22

ముంబయి, జూలై 19: మహారాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మైనర్‌పై సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఘటనలో దోషులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ సర్వత్రా ఊపందుకుంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, దారుణానికి పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా చూస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘కామంధులకు ఉరిశిక్షే సరైన శిక్ష.

Pages