జాతీయ వార్తలు

ఉరే సరైన శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 19: మహారాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మైనర్‌పై సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఘటనలో దోషులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ సర్వత్రా ఊపందుకుంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, దారుణానికి పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా చూస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘కామంధులకు ఉరిశిక్షే సరైన శిక్ష. కోపర్ది దుర్మార్గులకు మరణశిక్ష వేయడం ద్వారా ఇలాంటి ఘాతుక చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండేందుకు సరైన సందేశం అవుతుంది’ అని ఆయన అన్నారు. కోపర్దిలో తొమ్మిదో తరగతి విద్యార్థిపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటన అత్యంత హేయమైన, తీవ్రమైన నేరంగా ఆయన అభివర్ణించారు. డిఎన్‌ఏ నివేదిక దోషులకు శిక్ష పడేందుకు ఉపయోగపడుతుందని సభలో ఆయన వెల్లడించారు. ‘ఐదుగురు సభ్యులు గల బృందం, ఫొరెన్సిక్ నిపుణుల సహకారంతో దోషులపై చార్జిషీట్ రూపొందిస్తాం’ అని ఆయన చెప్పారు. నాలుగైదు రోజుల్లో చార్జిషీట్ పూర్తవుతుందని ఫడ్నవీస్ తెలిపారు. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దోషులకు ఉరిశిక్ష వేయాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరుతుందని ఆయన ప్రకటించారు. ‘ఈ కేసును ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణిస్తోంది. దోషులకు శిక్ష పడేలా చూస్తుంది. ఎలాంటి అలసత్వం ప్రదర్శించదు’ అని ముఖ్యమంత్రి సభకు హామీ ఇచ్చారు. ఇలా ఉండగా కోపర్ది గ్యాంగ్ రేప్ ఘటన ఉభయ సభలనూ కుదిపేస్తోంది. దారుణ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పోలీసులు సకాలంలో స్పందించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ‘ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదు’ అని ఆయన తెలిపారు. మరొకడికోసం గాలిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడు జితేంద్ర షిండే ఓ హత్య కేసులో పాత నేరస్థుడని, దీనిపై సిఐడి విచారణ జరుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను రష్యాలో ఉన్నందున బాధితురాలి గ్రామాన్ని సందర్శించలేకపోయానన్న ఫడ్నవీస్ ‘ఇన్‌చార్జి మంత్రి, ఉన్నతాధికారులు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు’ అని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ న్యాయవాది ఉజ్జల్ నికమ్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది.
అహ్మద్‌నగర్ జిల్లా కోపర్దిలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనలో దోషులకు మరణశిక్ష విధించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించాలని మంగళవారం ఆయన డిమాండ్ చేశారు.