జాతీయ వార్తలు

నేటి నుంచి తుంగభద్ర కాల్వలకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూలై 19: కర్నాటక, ఆంధ్రలోని కాల్వలకు తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం సాగు, తాగునీరు విడుదల చేయనున్నారు. ఎడమ, కుడికాల్వలు, పవర్‌కెనాల్‌తో పాటు హెచ్చెల్సీ, ఎల్లెల్సీకి సైతం నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. కాల్వలకు ఒకేసారి అటు కర్నాటక ఇటు ఆంధ్ర కోటా విడుదల చేస్తే నీటి వృథా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే విధంగా ఎగువ, దిగువ కాల్వలకు సైతం నేటినుంచి నీరు విడుదల చేసేందుకు ఆంధ్ర అధికారులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. కర్నాటకలోని ఎడమ కాలువతో పాటు ఎల్లెల్సీకి ప్రారంభంలో రోజుకు 650 క్యూసెక్కులు, హెచ్చెల్సీకి 1500 క్యూసెక్కులు విడుదల చేయాలని నిర్ణయించారు. తదనంతరం క్రమేపీ నీటి విడుదల పెంచేలా చూడాలని నిర్ణయించారు. ప్రస్తుతం జలాశయంలో 38 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా కాల్వలకు నీరు విడుదల నిర్ణయంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.