జాతీయ వార్తలు

ఏక కాలంలోనే యావజ్జీవ శిక్షలు: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఒకే వ్యక్తికి రెండు యావజ్జీవ ఖైదును విధించినప్పటికీ వాటిని ఏకకాలంలో అమలు చేయాలే తప్ప ఒకదాని తర్వాత ఒకటిగా కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఒకదాని తర్వాత ఒకటిగా యావజ్జీవ శిక్షల్ని అమలు చేయడం నిర్హేతుకమని, మనిషికి ఒకే జన్మ అన్న వౌలిక భావనకు ఇది విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. హత్య వంటి నేరాల విషయంలో ఒకే నేరస్తుడికి పలు యావజ్జీవ కారాగార శిక్షలు విధించాల్సి వచ్చినా..అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉండేలా చూడాలని, ఒక కేసులో వచ్చిన శిక్ష మినహాయింపుమరో కేసుకూ వర్తించేదిగా ఉండకూడదని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యావజ్జీవ శిక్షలు ఒకదాని తర్వాత ఒకటిగా అమలు కాకూడదని పునరుద్ఘాటించింది. ఏకకాలంలో హత్యలు సహా అనేక కేసుల్లో ముత్తురామలింగం అనే నేరస్తుడికి యావజ్జీవం సహా అనేక శిక్షలు పడ్డాయి. వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేయాలంటూ దిగువ కోర్టు జారీ చేసిన ఆదేశంపై సుప్రీం కోర్టు ఈ తాజా రూలింగ్ ఇచ్చింది.

ప్రజా ప్రభుత్వాల్ని కుప్పకూలుస్తారా?
లోక్‌సభలో కాంగ్రెస్ ధ్వజం

రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై వాకౌట్

న్యూఢిల్లీ, జూలై 19:ఓ పక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలనూ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వాలను ఎన్డీయే సర్కార్ కుప్పకూలుస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విరుచుకు పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో మరింత ఉత్సాహంగా ఎన్డీయేపై కాంగ్రెస్ నేతల విసుర్లు సాగాయి. అరుణాల్ ప్రదేశ్ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలే కారణమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘ఏ పడవకైనా చిల్లు ఉంటే అది మునిగిపోవడం ఖాయం’అంటూ వ్యాఖ్యానించారు. అరుణాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల పరిణామాలతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజా ప్రభుత్వాలను కుప్పకూల్చే అలవాటు కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. కాగా, రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

‘నీట్’బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 19: మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. నీట్‌గా పేర్కొనే ఈ ఉమ్మడి పరీక్ష పరిధిలోకి ప్రైవేటు కాలేజీలు కూడా వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారత వైద్య మండలి చట్టం,డెంటిస్ట్‌ల చట్టాన్ని సవరించడం ద్వారా నీట్‌కు రాజ్యాంగ బద్ధతను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. సభ ఆమోదం కోసం ఈ బిల్లును ప్రవేశ పెట్టిన ఆరోగ్య మంత్రి నడ్డా మూడు ప్రధాన లక్ష్యాలతోనే దీన్ని చేపట్టామన్నారు. వివిధ కోర్సులకు అనేక పరీక్షలు నిర్వహించే పద్దతికి స్వస్తి పలకడం, స్వేచ్ఛ, పారదర్శక రీతిలో పరీక్షలు నిర్వహించడం, ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్ల కుండా చూడటమే దీని లక్ష్యమన్నారు.