S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2016 - 16:11

దిల్లీ: బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర రూ. 200 తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.30,550గా ఉంది. వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. వెండి ధర కూడా రూ. 240 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,260గా ఉంది.

07/18/2016 - 12:03

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని పోలీసులు హతమార్చినందుకు నిరసనగా జమ్ము-కాశ్మీర్‌లో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. అధికార పిడిపికి చెందిన ఎమ్మెల్యే మహ్మద్ ఖలీల్ వెళుతున్న వాహనంపై ఆదివారం అర్ధరాత్రి ఆందోళన కారులు రాళ్లదాడికి దిగారు. దీంతో ఖలీల్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు.

07/18/2016 - 12:00

అమృత్‌సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో స్వర్ణదేవాలయం ఫొటోను ముద్రించినందుకు సిక్కులకు క్షమాపణలు కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఉదయం ఇక్కడి స్వర్ణదేవాలయంలో సేవ చేశారు. ఆలయం వంటగదిలో పాత్రలను ఆయన శుభ్రం చేశారు. ఈ సేవ ద్వారా తన తప్పును సరిదిద్దుకున్నట్లు ఆయన భావిస్తున్నారు.

07/18/2016 - 12:00

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 12వరకూ జరిగే ఈ సమావేశాల్లో జిఎస్‌టితో పాటు పలు కీలకబిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించేలా అధికార పక్షం ఇప్పటికే వ్యూహరచన చేసింది.

07/18/2016 - 08:42

ఇటానగర్, జూలై 17: అరుణాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పేమ ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 37 సంవత్సరాల పేమ ఖండూ దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈశాన్య రాష్టమ్రైన అరుణాచల్‌ప్రదేశ్‌కు తొమ్మిదో ముఖ్యమంత్రి అయిన పేమ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోంది.

07/18/2016 - 08:39

ఇస్తాంబుల్/అంకారా, జూలై 17: టర్కీలో తనను పదవీచ్యుతుని చేసేందుకు కుట్రచేసిన వారిపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కఠినమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరినీ వెంటాడి వేటాడుతున్నారు. శనివారమే దాదాపు మూడు వేల మంది సైనికులను జైళ్లలోకి నెట్టేసిన ఎర్డోగన్ బలగాలు.. ఆదివారం ఉదయం నుంచీ కుట్రలో భాగస్వాములని అనుమానించిన వారందరినీ వెతికి మరీ పట్టుకుంటున్నాయి.

07/18/2016 - 08:38

లక్నో, జూలై 17: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్‌కు పెద్దప్రమాదం తప్పింది. ఆదివారం రోడ్‌షోలో భాగంగా ఒక మినీ ట్రక్కుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదిక కూలిపోవడంతో స్వల్ప గాయాలతో ఆమె బైటపడ్డారు.

07/18/2016 - 08:37

న్యూఢిల్లీ, జూలై 17: అనేక అంశాలపై కేంద్రంతో పోరాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పనితీరువల్ల కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ‘్భరత్-పాకిస్తాన్’ సంబంధాల్లా మారాయని అన్నారు.

07/18/2016 - 08:37

అహ్మదాబాద్, జూలై 17: పటేళ్ల కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు ఆరునెలల రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించడంతో ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు రాష్ట్రం విడిచివెళ్లడానికి 48 గంటల గడువు విధించిన విషయం విదితమే.

07/18/2016 - 08:36

న్యూఢిల్లీ, జూలై 17: పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైకాపా లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ అన్నారు. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయ సాయిరెడ్డి హాజరయ్యారు.

Pages