S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/17/2016 - 16:31

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగంజ్‌లో కల్తీ మద్యం తాగి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్తీకల్లు తాగిన మరుక్షణం వారంతా అనారోగ్యానికి గురయ్యారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన ప్రభుత్వం ముగ్గురు ఎక్సైజ్‌శాఖ అధికారులను సస్పెండ్ చేసింది.

07/17/2016 - 16:30

వాడి:మహారాష్టల్రోని వాడిలో నాలుగురోజుల క్రితం జరిగిన పరువు హత్య వెలుగుచూసింది. ప్రేమ వ్యవహారంలో కూతురివైఖరి నచ్చని తల్లి స్వయంగా ఆమెను చంపేసింది. వాడి గ్రామానికి చెందిన ముక్తాబాయ్ తన కుమార్తె అంకితను గొంతునులిమి హత్య చేసింది. మొదట సాధారణ మరణమే అని భావించినా పలువురి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిజం తెలిసింది.

07/17/2016 - 16:29

సూరత్:గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. సూరత్, రంధేర్, అమ్రేలి, సవర్‌కుండ్లా తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సూరత్‌కు 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది.

07/17/2016 - 16:29

న్యూఢిల్లి:్ఢల్లీ ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘టాక్ విత్ ఏకె’ కార్యక్రమం ఉద్దేశించిన విధంగా లేదని, ఏకె చెప్పింది వినాలన్నట్లుందని బిజెపి వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీనుంచి వచ్చిన ప్రశ్నలు తక్కువని, దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రశ్నలు అడిగించారని బిజెపి ఆరోపించింది.

07/17/2016 - 16:28

న్యూఢిల్లి:ప్రధాని ‘మన్‌కీబాత్’ తరహాలో ఢిల్లీ ముఖ్యమంత్రి తలపెట్టిన ‘టాక్ విత్ ఎకె’ రేడియో ముఖాముఖి ఆదివారం నాడు ప్రారంభమైంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకునేందుకు, పార్టీ విస్తృతికి ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా తొలిరోజు ముఖాముఖికి పెద్దఎత్తునే శ్రోతలు ప్రశ్నలు సంధించారు.

07/17/2016 - 15:16

ఇటానగర్:అరుణాచల్‌ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జరిగిన నాటకీయ పరిణామాల తరువాత ఖండూకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల పెమాఖండూ దేశంలో అత్యంత పిన్నవయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతగా రికార్డు సృష్టించారు.

07/17/2016 - 15:14

దిస్‌పూర్:అసోంలోని కోక్రాఝుర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు బోడో తీవ్రవాదులు హతమయ్యారు. మరణించివారంతా నేషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ బోడోలాండ్‌కు చెందిన అగ్రనాయకులుగా గుర్తించారు. అటవీప్రాంతంలో బోడో తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యలను గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతాబలగాలు అప్రమత్తమై జల్లెడ పట్టాయి.

07/17/2016 - 06:13

భద్రాచలం/చింతూరు, జూలై 16: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్‌రేల్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను ఇంకా గుర్తించ లేదు.

07/17/2016 - 04:47

ముంబయి, జూలై 16: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ ప్రచారక్ సురేశ్ కేట్కార్ శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. అనారోగ్యానికి గురయిన కేట్కార్ లాతూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు తెలిపాయి.

07/17/2016 - 03:52

ఇటానగర్, జూలై 16: అరుణాచల్ ప్రదేశ్‌లో శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో పోయిన పదవిని చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి నబం టుకీ పదవిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం వర్గం ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అత్యవసర సమావేశమైన సిఎల్పీ సమావేశంలో తమ నేతగా పేమా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Pages