S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2016 - 08:35

శ్రీనగర్, జూలై 17: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ హత్య దరిమిలా తలెత్తిన అల్లర్లు, హింసాకాండ దృష్ట్యా జమ్మూ, కాశ్మీర్‌లో ఆదివారం తొమ్మిదో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది. ఈ అల్లర్లలో 39 మంది మరణించగా, 3100 మంది గాయపడిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలను కాపాడడానికి ముందుజాగ్రత్త చర్యగా కాశ్మీర్ లోయలోని మొత్తం పది జిల్లాల్లోను ఆదివారం కూడా కర్ఫ్యూ అమలులో ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

07/18/2016 - 08:35

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ భవనంపై మరోసారి దాడి జరగకుండా నిరోధించటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దుర్భేద్యమైన భద్రతాచర్యలకు పూనుకుంది. ‘‘ఆపరేషన్ గోల్డెన్ నోస్’’ పేరుతో కరడుగట్టిన కోరపళ్లున్న జాగిలాలతో ప్రత్యేక భద్రతావలయాన్ని ఏర్పాటు చేసేందుకు హోంశాఖ ఆదివారం ఆమోదం తెలిపింది. ఇండియా టుడే కథనం ప్రకారం పార్లమెంట్‌లో ఇప్పటికే బహుళ అంచెల భద్రతావ్యవస్థ అమలులో ఉంది.

07/18/2016 - 08:30

ఇస్తాంబుల్/న్యూఢిల్లీ, జూలై 17: మన దేశంలోని చండీగఢ్, ప్రపంచంలోని మూడో ఎత్తయిన పర్వతం ఖంగ్జ్‌చెండ్‌జోంగాకు పుట్టినిల్లయిన సిక్కిం నేషనల్ పార్కును యునెస్కో ఆదివారం ప్రపంచ వారసత్వ సంపద స్థలాల జాబితాలో చేర్చించింది. మన దేశంతో ముడిపడిన మూడు నామినేషన్లకూ ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం.

07/18/2016 - 07:36

న్యూఢిల్లీ, జూలై 17: విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవద్రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆహ్వానించారు. ఆదివారం ఆయన ప్రధానిని కలిసారు.

07/18/2016 - 07:18

న్యూఢిల్లీ, జూలై 17: గుజరాత్, పంజాబ్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మూడు ఓ మోస్తరు భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల సమయంలో పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.6 పాయింట్ల తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్, దేశ రాజధాని డిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.

07/18/2016 - 05:56

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఢిల్లీలోని సిఎం నివాసంలో కెసిఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రానికి పార్లమెంట్‌లో అంశాలవారీగా మద్దతిస్తూనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో లేవనేత్తాలని ఎంపీలకు సూచించారు.

07/18/2016 - 05:51

ముంబయి / అహ్మద్‌నగర్, జూలై 17: తొమ్మిదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఈ అమానుషానికి పాల్పడి, ఆమె శరీరాన్నంతా గాయాల మయం చేసి, ఎముకలు విరిచేయబడి, అనంతరం గొంతు నులిమి చంపేసినట్లుగా తెలుస్తోంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్ది గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్రస్థాయిలో నిరసనలకు దారితీస్తోంది.

07/18/2016 - 04:47

న్యూఢిల్లీ, జూలై 17: సాదారణంగా పరస్పరం దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీలు జమ్మూ, కాశ్మీర్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం ఒకే గొంతుతో మాట్లాడాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇలా అన్ని పార్టీలు ఒకే మాట వినిపించడం ప్రపంచ దేశాలకు ఓ మంచి సందేశాన్ని పంపించడమే కాక, దేశానికి సైతం మేలు చేసిందని మోదీ అన్నారు.

07/18/2016 - 04:46

న్యూఢిల్లీ, జూలై 17: నేటినుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు, కాశ్మీర్ ఉద్రిక్తతలు, ఎన్డీయే విధించిన రాష్టప్రతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేయడం, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లభించకపోవటం, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఘాటుగానే చర్చ జరగనుంది.

07/18/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 17: లైంగిక వేధింపులకు గురైన కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇకపై మూడు నెలలు వేతనంతోకూడిన సెలవు తీసుకోవచ్చు.

Pages