S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2016 - 23:55

ముంబయి, జూలై 18: మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే, పరారీలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫోన్ల మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఎటిఎస్) సోమవారం బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఒక హ్యాకర్ ఆరోపించినట్లు ఏక్‌నాథ్ ఖడ్సేకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తమ విచారణలో తేలిందని ఎటిఎస్ తరపు న్యాయవాది నితీన్ ప్రధాన్..

07/18/2016 - 23:53

న్యూఢిల్లీ, జూలై 18: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తరర్‌ను విచారించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరర్‌ను సిట్ ఫిబ్రవరిలో ఆమె కోరుకున్న ప్రదేశమైన ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్‌లో విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.

07/18/2016 - 23:52

ససరాం (బిహార్), జూలై 18: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ గ్రామీణులను ఎంత ప్రభావితం చేస్తుందో తెలియజేసే ఘటన బిహార్‌లో జరిగింది. రొహ్‌తాస్ జిల్లాకు చెందిన ఓ మహిళ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి ఇంట్లో టాయిలెట్ నిర్మాణానికి నడుంబిగించింది.

07/18/2016 - 18:43

బెంగళూరు: కర్ణాటక రాజధాని అభివృద్ధి మంత్రి కేజే జార్జ్‌ తన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

07/18/2016 - 18:38

చెన్నై: పేద విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జయలలిత సోమవారం చెన్నై సెక్రటేరియట్‌లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్‌ కార్డు బస్‌పాస్‌లు అందజేశారు. ఈ పథకంలో 2015-16 సంవత్సరంలో సుమారు 28.05 లక్షల విద్యార్థులు లబ్ధి పొందిగా, ఈ సంవత్సరం దాదాపు 31.11లక్షల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌కార్డు బస్‌ పాస్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది.

07/18/2016 - 18:09

బెంగళూరు: డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. మంగళూరులో పనిచేస్తున్న డిఎస్పీ గణపతి ఇటీవల ఓ స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

07/18/2016 - 18:09

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌పై కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని, ఆ రాష్ట్ర ప్రజలను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గులాబ్‌నబీ ఆజాద్ విమర్శించారు. ఆయన సోమవారం పార్లమెంటు సమావేశంలో కాశ్మీర్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే కేంద్రానికి తాము సహకరిస్తామని అయితే కాశ్మీర్ ప్రజలను వేధించాలని చూస్తే సహించబోమన్నారు.

07/18/2016 - 17:51

ముంబయి: ఇక నుంచి ఏడాదిలో ఒకసారి ఉచితంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(సిబిల్‌) ద్వారా క్రెడిట్‌ నివేదికను పొందవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. ప్రస్తుతం క్రెడిట్‌ నివేదిక పొందాలంటే సిబిల్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఇక నుంచి ఏడాదికి ఒకసారి ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

07/18/2016 - 17:44

పట్నా: బిహార్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కోసి, గండక్‌, బాగ్‌మతి, గంగా నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ఉత్తర బిహార్‌లోని జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ తెలిపింది. తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, సుపాల్‌, సహర్సా, కగారియా జిల్లాల్లో నదులు తీవ్ర రూపం దాల్చాయి. గంగా నది సైతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాజధాని పట్నా, వివిధ ప్రాంతాలకూ వరద ముప్పు పొంచి ఉంది.

07/18/2016 - 16:33

దిల్లీ: బిజెపి సీనియర్ నాయకుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి అన్సారీ ఆమోదించారు. 2004 నుంచి 2014 వరకూ సిద్ధూ అమృతసర్ నుంచి బిజెపి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

Pages