S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/28/2018 - 01:48

ఆకివీడు, అక్టోబర్ 27: కొల్లేరు అభయారణ్య పరిధిలో కొల్లేటి పక్షులను వేటాడి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని శనివారం అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. మండలంలోని చినమిల్లిపాడు గ్రామానికి చెందిన పల్లెం యోహన్‌ను చిలువ బాతులను చంపి చర్మం వలిచిన 16 పక్షులతో అతడిని అదుపులోనికి తీసుకున్నారు.

10/28/2018 - 01:23

విజయవాడ (క్రైం), అక్టోబర్ 27: డ్రగ్స్ మాఫియా బెజవాడ నగరంపై కనే్నసింది. టెక్నాలజీ, వౌలిక వసతులు, పర్యాటకం, ఇతర వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో ముందడుగు వేస్తున్న రాష్ట్ర రాజధానిలో సాంకేతిక పరిజ్ఞానంతో నేర ప్రపంచాన్ని విస్తరించాలన్న సైబర్ క్రిమినల్స్‌తోపాటు, మత్తు మాఫియా కూడా అర్రులు చాస్తోంది.

10/28/2018 - 00:58

పొన్నూరు, అక్టోబర్ 27: పొన్నూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు, రైలుపేట నివాసి యర్రంశెట్టి గంగాధరరావు (45) మృతదేహం పట్టణంలోని తుంగభద్ర డ్రైన్‌లో తేలియాడుతూ శనివారం కన్పించింది. మృతదేహాన్ని పొన్నూరు పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యా, హత్య అనే విషయం తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పట్టణ ఎస్‌ఐ కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

10/28/2018 - 00:57

మంథని, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుండి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి దొంగనోట్లను తరలిస్తున్న ముఠా శనివారం స్టాటిక్ సర్వేలెన్స్ టీంకు పట్టుబడింది.

10/28/2018 - 00:48

రామచంద్రపురం, అక్టోబర్ 27: రామచంద్రపురం జడ్పీటీసీ జోగా వీరభద్రరావు ఇంట్లో శుక్రవారం రాత్రి భారీచోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. ఇంటికి కాపలాగా ఉండే కుక్కను కూడ మత్తు ఇచ్చి ఇంటిని దోచుకున్నారు. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరిధిలోని వెలంపాలెం గ్రామంలో వీరభద్రరావు నివసిస్తున్నారు.

10/28/2018 - 00:42

తిరుపతి, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్లనే కాకుండా రాళ్లు విసరడంతో ఎఫ్‌బిఓ కోదండ తలకు గాయమైంది. అయినప్పటికీ టాస్క్ఫోర్స్ సిబ్బంది తమిళనాడు, విల్లుపురం జిల్లాకు చెందిన నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

10/28/2018 - 00:48

భద్రాచలం టౌన్, అక్టోబర్ 27: చత్తీస్‌గఢ్‌లో ఈసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల విస్తృత కూంబింగ్‌లు, వరస ఎన్‌కౌంటర్లతో ఇటీవల కాలంలో భారీగా నష్టం చవిచూసిన మావోయిస్టులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదును చూసి సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడి చేశారు.

10/27/2018 - 23:23

మార్టూరు, అక్టోబర్ 27: తండ్రి మందలించాడని మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి అంజిరెడ్డి తన కుమారుడైన హర్షవర్థన్‌రెడ్డి(16) వరపర్ల ఎం ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు వచ్చి సినిమాకి వెళ్లాడు.

10/27/2018 - 22:15

గోరంట్ల, అక్టోబర్ 27 : మండల పరిధిలోని శిరిగంవాండ్లపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ ధరణికిషోర్ తెలిపారు. గ్రామానికి చెందిన కవితమ్మను నాలుగేళ్ల క్రితం ఓడీసీ మండలం చౌడంపల్లికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. దసరా పండుగకు పుట్టింటికి వచ్చిన కవిత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

10/27/2018 - 01:01

సైదాబాద్, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ కంపెనీ సీఈఓ నౌహీరా షేక్ విడుదల అయిన వెనువెంటనే మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హీరాగ్రూప్ కుంభకోణం కేసులో అరెస్టయి చంచల్‌గూడ మహిళా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నౌహీరాషేక్‌కు బుధవారమే న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Pages