క్రైమ్/లీగల్

కొల్లేటి పక్షులను వేటాడుతున్న వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, అక్టోబర్ 27: కొల్లేరు అభయారణ్య పరిధిలో కొల్లేటి పక్షులను వేటాడి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని శనివారం అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. మండలంలోని చినమిల్లిపాడు గ్రామానికి చెందిన పల్లెం యోహన్‌ను చిలువ బాతులను చంపి చర్మం వలిచిన 16 పక్షులతో అతడిని అదుపులోనికి తీసుకున్నారు. మండలంలోని సిద్దాపురం ప్రాంతంలోని ఊరకోడు ప్రాంతంలో కొల్లేటి పక్షులను వేటాడి చర్మం వలిచి తీసుకువస్తున్న యోహాన్‌ను అటవీ శాఖ అధికారులు వలపన్ని అరెస్టు చేశారు. ఇతని వద్దనుంచి చర్మం వలిచిన పక్షులను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై వైల్డ్‌లైఫ్ యాక్ట్1972 అండర్ సెక్షన్ 9, 29, 27, 61, 62 కింద కేసు నమోదు చేశామని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. భీమవరం కోర్టులో హాజరుపర్చగా యోహన్‌కు నవంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించారన్నారు. ఈ దాడిలో సిద్దాపురం సెక్షన్ బీట్ గార్డు శ్రీనివాసరావు, సహాయకుడు జంగం అంజి పాల్గొన్నారు.

యధేచ్ఛగా పక్షుల వేట
గత కొంత కాలంగా కొల్లేరు అభయారణ్య పరిధిలో పక్షుల వేట యధేచ్ఛగా సాగుతోందని సర్వత్రా విమర్శలు విన వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి వలస పక్షులు ప్రతీ ఏటా విడిది కోసం ఇక్కడికి వస్తాయి. అయితే ఇదే అదునుగా వేటగాళ్లు కొల్లేరు ప్రాంతంలో వలలు పన్ని పక్షులను వేటాడుతున్నారు. వీటిలో చిలువ బాతులకు ధర కూడా ఎక్కువగా ఉండటంతో వీటిని వేటాడి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తుంటారు. ఇటీవల కాలంలో కొల్లేటి పక్షుల వేట యధేచ్ఛగా సాగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. వేటాడిన పక్షులను అటవీ శాఖ అధికారుల సాక్షిగానే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆకివీడు శివారు సిద్దాపురం వెళ్లే మార్గంలో చెక్‌పోస్టు ఉన్నప్పటికీ నిఘా అంతంత మాత్రంగానే ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు వంటి నగరాలకు తరలిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిఘా కొరవడటంతో వీటి రవాణా ఎక్కువగా ఉంటుందని బాహాటంగా విమర్శలు వినపడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని పలువురు పక్షుల ప్రేమికులు కోరుతున్నారు.

గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు మెరుపుదాడి
* నాలుగు పొక్లయినర్లతోపాటు 14 టిప్పర్లు స్వాధీనం
ద్వారకాతిరుమల, అక్టోబర్ 27: పోలవరం కుడి కాలువ గట్టు వద్ద అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై శనివారం జిల్లా విజిలెన్స్ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నాలుగు పొక్లయినర్లతోపాటు 14 ట్రిప్పర్లను అధికారులు స్వాధీనం చేసుకుని తవ్వకాలు జరిపిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.15 లక్షలు జరిమానాగా విధించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ సిహెచ్ శ్రీహరిబాబు తెలిపిన వివరాల ప్రకారం..ద్వారకాతిరుమల మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలోని గుణ్ణంపల్లి వద్ద రెండు ప్రాంతాల్లో పోలవరం కుడి కాలువ గట్టును కొంచెం లోతుగా టిప్పర్ల ద్వారా తవ్వి గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారుల ఆదేశాల మేరకు ఈ అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రావెల్ తవ్వకాలకు వినియోగిస్తున్న నాలుగు పొక్లయినర్లను, అలాగే గ్రావెల్ తరలింపునకు వినియోగిస్తున్న 14 టిప్పర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గ్రావెల్ మట్టిని గుండుగొలను- దూబచర్ల మధ్య ఉన్న రహదారి విస్తరణ పనులకు వినియోగిస్తున్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇప్పటి వరకూ 4,758 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తవ్వినట్టు గుర్తించిన అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.15 లక్షలు జరిమానా విధించారు. దీనిపై తదుపరి విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ డీఈని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డీఈ శ్రీహరిబాబు ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ భోగోళ శాస్తవ్రేత్త జి జయప్రసాద్, సీఐ వివి నాగేశ్వరరావు, ఏఈ పి శ్రీనివాసరావు, ఎస్సై కె ఏసుబాబు, మైన్స్ ఆర్‌ఐ శ్రీ్ధర్, సర్వేయర్ సీతావాణి తదితరులు ఉన్నారు.