క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, అక్టోబర్ 27 : మండల పరిధిలోని శిరిగంవాండ్లపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ ధరణికిషోర్ తెలిపారు. గ్రామానికి చెందిన కవితమ్మను నాలుగేళ్ల క్రితం ఓడీసీ మండలం చౌడంపల్లికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. దసరా పండుగకు పుట్టింటికి వచ్చిన కవిత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తవారింట్లో వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
ఆత్మకూరు, అక్టోబర్ 27: మండల పరిధిలోని గొరిదిండ్ల, వేపచర్ల గ్రామాల మధ్య ఆటో బోల్తా పడి శుక్రవారం రాత్రి వేపచర్లకు చెందిన కె.హనుమంతునాయక్ (62) మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి సోదరుడు, మండల ఇన్‌చార్జి బాలాజీ శనివారం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.10 వేల నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌చౌదరి, శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ సూరి పాల్గొన్నారు.