క్రైమ్/లీగల్

వెలంపాలెంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 27: రామచంద్రపురం జడ్పీటీసీ జోగా వీరభద్రరావు ఇంట్లో శుక్రవారం రాత్రి భారీచోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. ఇంటికి కాపలాగా ఉండే కుక్కను కూడ మత్తు ఇచ్చి ఇంటిని దోచుకున్నారు. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరిధిలోని వెలంపాలెం గ్రామంలో వీరభద్రరావు నివసిస్తున్నారు. ఈనెల 23న హైదరాబాద్ వెళ్లగా కింద పోర్షనులో ఉంటున్న ఆయన సోదరుడు ఈ నెల 26న తిరుపతి వెళ్లారు. వీరభద్రరావు కుమారుడు వీరబాబు తదితరులు వ్యాపార వ్యవహారాల నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి దొంగలు ఇంటి తాళాలు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించి, సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు, బంగారం బిస్కెట్ ముక్కలు, తొమ్మిది కిలోల విలువైన వెండి సామాన్లతో పాటు ఇంటిలో ఉంచిన రూ.2.35 లక్షల నగదు దోచుకున్నారు. ఇంటి పనిమనిషి శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన సమయంలో ప్రధాన ద్వారం తెరిచి ఉండడం గమనించి హైదరాబాద్‌లో ఉన్న వీరభద్రరావు భార్యకు ఫోన్ చేయగా ఆమె కుమారుని స్నేహితుడు వెలంపాలెంకు చెందిన నంగి వెంకటేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంకటేష్ పై అంతస్తులోకి వెళ్లి చూడగా తాళం బద్ధలు కొట్టినట్టు, కాపలా కుక్క మగతగా ఉండడం గమనించి విజయవాడలో ఉన్న వీరబాబుకు సమాచారం అందించాడు. దాంతో వీరబాబు హుటాహుటిన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్రాక్షారామ ఎస్సై గోవాడ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్‌తో పాటు, రెండు క్లూస్ టీం సభ్యులు పరిశీలించి ఆనవాళ్లు సేకరించే కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ.13.99 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీకి గురైన సంఘటనపై డీఎస్పీ సంతోష్ నేతృత్వంలో సీఐ శ్రీ్ధర్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.