క్రైమ్/లీగల్

నగరంలో డ్రగ్స్ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 27: డ్రగ్స్ మాఫియా బెజవాడ నగరంపై కనే్నసింది. టెక్నాలజీ, వౌలిక వసతులు, పర్యాటకం, ఇతర వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో ముందడుగు వేస్తున్న రాష్ట్ర రాజధానిలో సాంకేతిక పరిజ్ఞానంతో నేర ప్రపంచాన్ని విస్తరించాలన్న సైబర్ క్రిమినల్స్‌తోపాటు, మత్తు మాఫియా కూడా అర్రులు చాస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ, ఇతర రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలో కూడా అత్యంత ఖరీదైన మత్తు, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని విస్తరించేందుకు డ్రగ్స్ మాఫియా తమ కార్యకలాపాలను షురూ చేసింది. ఖరీదైన యువత, విద్యార్థులు, లగ్జరీ కోరుకునే కొందరు మహిళలు, వ్యక్తులను ఆకర్షించేందుకు హైదరాబాద్, ముంబయి తరహాలో బ్యూటీ క్లినిక్‌లు, క్రాస్ మసాజ్ సెంటర్లు ఓపెన్ చేసేందుకు డ్రగ్స్ మాఫియా ప్రణాళిక రచించినట్లు పోలీసుశాఖ అనుమానిస్తోంది. పూర్తిగా మహిళలతో నిర్వహించే వీటి మాటున కొకైన్, హెరాయిన్, చరాస్ వంటి అతి ఖరీదైన డ్రగ్స్‌ను పరిచయం చేస్తూ సొమ్ము చేసుకోవడమే వీరి లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రాజధాని పేరు వినిపిస్తున్న తరుణంలో ఇక్కడ కూడా తమ మార్కెట్‌ను విస్తరించి మత్తు మాఫియా సామ్రాజ్యాన్ని నడపాలన్నదే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. ఖరీదైన మత్తు ప్రపంచంలో ఓలలాడాలని తపించే కొందరు అప్పుడప్పుడు నగరం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, వంటి పెద్ద పెద్ద ప్రాంతాలకు వెళ్లి తమ కోరికలు తీర్చుకుని వస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి సొమ్ము చేసుకోవాలని డ్రగ్స్ మాఫియా నగరంలో గత కొద్దిరోజులుగా సర్వే నిర్వహించినట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. సంపన్న వర్గాల ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులను తమ ఊబిలోకి లాక్కుని ఏజెంట్లుగా మార్చుకుని మత్తు వ్యాపారం నిర్వహించాలని మాఫియా వ్యూహం పన్నినట్లు సమాచారం. తాజాగా పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ మాఫియాకు చెందిన ముఠా సభ్యుల నుంచి శాంపిల్స్ మాత్రమే స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరి నుంచి కీలక సమాచారం ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది.
గత మూడు మాసాలుగా పరిశీలిస్తే.. నకిలీ ఆధార్ కార్డుల తయారీ, అక్రమ ఫైర్ క్రాకర్స్, కాపీరైట్ ఉల్లంఘన, గుట్కా, విదేశీ సిగరెట్లు, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో టాస్క్ఫోర్సు కొరడా ఝుళిపించింది. ఇప్పుడు తాజాగా పట్టుబడిన డ్రగ్స్ మాఫియా ఉదంతంతో మరింత అప్రమత్తమయింది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ముంబయి, కోల్‌కత్తాకు చెందిన పల్లవి గణేష్ నికుంబు, రేష్మాసర్దాన్, ఓంకార్ పురుషోత్తం, షేక్ మస్తాన్ అలీ, సులెంకి రేఖ అలియాస్ సోనియా బేగం, రహిమా బీబీ, మొనియా సర్దార్‌లను సీపీ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్ బృందం తమ అదుపులోకి తీసుకుని వీరి నుంచి రెండు లక్షలు రూపాయల విలువైన నాలుగు గ్రాముల కొకైన్, పది గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితుల కాల్‌డేటా ఆధారంగా వీరి మూలాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన వీరు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా బ్రేక్ వేశామని సీపీ చెప్పారు.ప్రస్తుతం పట్టుబడిన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన మీదట తిరిగి కస్టడీకి తీసుకుని పూర్తి సమాచారాన్ని రాబడతామని తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

మద్యం మత్తులో భార్య, కూతురుపై కత్తితో దాడి
పెనుగంచిప్రోలు, అక్టోబర్ 27: మద్యం మత్తులో ఒక వ్యక్తి భార్య, కూతురుపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన మండలంలోని నవాబుపేటలో శనివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం నవాబుపేట గ్రామంలో ఇనుప సామాను వ్యాపారం చేసే షేక్ శంకర్ శివ సాహెబ్ 20 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన వౌలాబీతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. పెద్ద అమ్మాయికి రెండేళ్ల క్రితం వివాహం జరగ్గా మిగిలిన ఇద్దరు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అప్పులకు గురైన శంకర్ సాహెబ్ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో శనివారం ఉదయమే మద్యంను సేవించిన సాహెబ్ ఉదయం 7.30గంటల ప్రాంతంలో ఇంటి వద్ద పనులు నిర్వహించుకుంటున్న భార్య వౌలాబీ, కుతూరు షకీలాతో ఘర్షణ పడ్డాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురై శంకర్ సాహెబ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని భార్య, కూతురుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఐ అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై బాధిత కుమార్తె షకీలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.